వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇస్లాం ఉగ్రవాదం: మతం మారుతున్న ముస్లీంలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

బెర్లిన్: సిరియాలో ఉగ్రవాదం కట్టలు తెంచుకుంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున సిరియాలోని ముస్లీంలు యూరప్ దేశాలకు వలస వెళ్తున్నారు. అయితే, శరణార్థుల రూపంలో వస్తున్న వారు... క్రైస్తవ మతంలోకి మారి యూరోపియన్ దేశాల్లోకి వలస వస్తున్నారని తెలుస్తోంది.

సిరియాలో వేళ్లూనుకున్న ఇస్లామిక్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడలేక సిరియా ముస్లింలు యూరోపియన్ దేశాల వైపు చూస్తున్నారు. ఇప్పుడు మతం కూడా మార్చుకుంటున్నారు.

పలు ఐరోపా దేశాలు కేవలం క్రిస్టియన్లను మాత్రమే తమ దేశంలోకి రానిస్తూ, ముస్లింల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తుండటంతో ఇలా జరుగుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. బెర్లిన్ సమీపంలోని చర్చిలు మతం మార్చుకునేందుకు వస్తున్న ముస్లింలతో కిక్కిరిసి పోతున్నాయి.

Muslims converting to Christianity in Germany to get asylum

నీవు ఇస్లాంను వదిలేస్తున్నావా.. అని చర్చిలోని ఫాదర్ అడుగుతుంటే, అవును అని మతం మారుతున్న సిరియా ముస్లీంలో చెబుతున్నారని తెలుస్తోంది. వేలాది సంఖ్యలో ముస్లీంలు క్రైస్తవంలోకి మారుతున్నారని తెలుస్తోంది.

చాలామంది ఇరానియన్లు, సిరియన్లు తమకు మతంతో పని లేదని, ఆశ్రయమిస్తే చాలంటున్నారు. వారంతా తమ భవిష్యత్ పైన ఎన్నో ఆశలతో వస్తున్నారని, వారిని మేము ఆహ్వానిస్తున్నామని ఓ చర్చి పాస్టర్ చెప్పారు.
ఇరాన్ తదితర దేశాల్లో ఓ ముస్లిం మతస్తుడు క్రిస్టియన్‌గా మారాడంటే... అతనికి మరణశిక్ష విధిస్తారని గుర్తు చేసుకున్న ఓ శరణార్థి, ఇక తాను ఆ స్వదేశానికి వెళ్లనను అంటున్నాడు.

English summary
Muslims converting to Christianity in Germany to get asylum
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X