బుధగ్రహంపై కూలిపోనున్న నాసా వ్యోమనౌక మెసెంజర్
నాసా : వ్యోమనౌక మెసెంజర్ మరో రెండు వారాల్లో బుధగ్రహంపై కూలిపోతుందని అంతరిక్ష పరిశోధకులు వెల్లడించారు. 2004లో ప్రయోగించిన ఈ వ్యోమనౌకలో ఇంధనం పూర్తిగా నిండుకుందని అంటున్నారు. దీంతో ఈ నెల 30న సెకనుకు 3.91 కిలోమీటర్ల వేగంతో బుధగ్రహా ఉపరితలాన్ని తాకనుందని వివరించారు.
ఇది కూలిపోయే ప్రదేశాన్ని శాస్త్రవేత్తలు సుమారుగా అంచనా వేశారు. దాన్ని చూసే అవకాశం లేదని తెలిపారు. ఈ నెల 24న చివరిసారిగా కనిపించనున్న మెసెంజర్ ఆ తర్వాత మరో వారం పాటూ ప్రయాణించి 30న బుధుడి ఉపరితలాన్ని తాకుతుందని చెప్పారు.
పరిశోధకులు కానీ, వ్యోమగాములు కానీ దీన్ని చూసే అవకాశం లేదని వారు వెల్లడించారు. దీన్ని 2--4లో ఫ్లా కేప్ కానావెరాల్ నుంచి ప్రయోగించారు. 2001లో అది బుధగ్రహం కక్ష్యలోకి చేరిన మొదటి వ్యోమనౌక.

ఈ వ్యోమనౌక మెసెంజర్ సూర్యుడికి సమీపంలో ఉన్న బుధగ్రహం ధ్రువాల్లో నీటితో తయారైన మంచు ముద్దులు ఉన్నట్లు కనిపెట్టింది. జలంతో కూడిన మంచుకు కారణమైన వస్తువులే విచిత్రమైన సేంద్రియ వస్తువుల పొరలను కూడా కారణమైనట్లు కూడా దాని ద్వారా తెలిసిందని చెబుతున్నారు.
ఇప్పటికే మెసెంజర్‌లో ఇంధనం ముగిసింది. అయితే, దాని జీవిత కాలాన్ని పెంచడానికి ప్రొపలెంట్ ట్యాంక్స్‌పై ఒత్తిడి పెట్టడానికి ఉద్దేశించిన హీలియంను ప్రయోగించారు.












Click it and Unblock the Notifications