దారుణం: మర్మాంగం కోసి, కళ్ళు పీకేశారు, కారణమిదే!..
లాహోర్: తన కూతురుతో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడనే నెపంతో 15 ఏళ్ళ బాలుడిని కిడ్నాప్ చేసి అతడి మర్మాంగం కోసి కళ్ళు పీకేశాడు ఓ దుర్మార్గుడు.అయితే సకాలంలో ఆసుపత్రికి తరలించడంతో బాధితుడు ప్రాణాలతో బతికి బయటపడ్డాడు.ఈ ఘటన పాకిస్తాన్ లో చోటుచేసుకొంది.
పాకిస్తాన్ దేశంలోని పంజాబ్ రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది. 15 ఏళ్ల వయస్సున్న బాలుడు 9వ, తదగతి చదువుతున్నాడు. అయితే ఆ బాలుడికి వేరే అమ్మాయితో సంబంధం ఉందని అమ్మాయి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
మంగళవారం నాడు అబ్బాయిని స్కూల్ నుండి అమ్మాయి కుటుంబసభ్యులు కిడ్నాప్ చేశారు.అమ్మాయి తండ్రితో పాటు ఆయన సహచరులు బాలుడిని కిడ్నాప్ చేశారు. రావి నదికి సమీపానికి తీసుకెళ్ళారు.

బాలుడి మర్మాంగాన్ని కోసి. కళ్ళు పీకేశారు. కక్ష తీర్చుకొన్నారు.తన కూతురితో అక్రమసంబంధం ఉన్న కారణంగానే ఈ దాడికి పాల్పడ్డారు.
అయితే రక్షించాలని బాలుడు అరవడంతో బాటసారులు బాధితుడిని సకాలంలో ఆసుపత్రికి తరలించారు. దీంతో ఆయన ప్రాణాలు కాపాడు డాక్టర్లు. అయితే ఈ ఘటనకు పాల్పడిన నిందితుడు అధికారంలో ఉన్న పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి అని బాలుడి తండ్రి ఆరోపిస్తున్నాడు.
తన కొడుకును చిత్రహింసలు పెట్టిన నిందితుడిని అరెస్టు చేయాలని బాధితుడు అమ్మాయి కుటుంబసభ్యుల ఇంటి ఎదుట ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయాలని బాధితులు ప్రధాని నవాజ్ షరీప్ ను కోరారు.












Click it and Unblock the Notifications