పాక్ రక్షణ మంత్రి పిచ్చి ప్రేలాపనలు.. సింధూ జలాలపై నోరు పారేకుని అవాకులు చవాకులు!

కాశ్మీర్ లోయలో పాకిస్తాన్ ప్రేరిపిత ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. పహల్గాంలోని సుందరమైన బైసరన్ లోయ ఏప్రిల్ 22న పాశవిక దాడితో ఆ లోయ రక్తసిక్తమైంది. అమాయక పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన ఈ దాడిలో ఏకంగా 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణం యావత్ దేశాన్ని కలచివేసింది. ఈ ఘటనతో భారత్-పాకిస్థాన్ మధ్య సంబంధాలు అడుగంటిపోయాయి, ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.

పదేపదే ఉగ్రదాడులకు పాల్పడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న పాకిస్థాన్‌కు గుణపాఠం చెప్పేలా భారత్ ఈసారి భిన్నమైన, అత్యంత కీలకమైన చర్యలకు ఉపక్రమించింది. కేవలం సైనిక లేదా దౌత్యపరమైన ఒత్తిళ్లకు పరిమితం కాకుండా, పాకిస్థాన్ ఆర్థిక మూలాలపై దెబ్బ కొడుతోంది. వెన్నెముక వంటి వ్యవసాయ రంగంపై ప్రభావం చూపే నిర్ణయం తీసుకుంది. అందులో ముఖ్యమైనది సింధూ నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. ఇప్పటివరకు అనేక యుద్ధాలు, సైనిక ప్రతిష్టంభనలు వచ్చినా ఈ ఒప్పందం సురక్షితంగానే ఉంది. కానీ పహల్గాం దాడి తర్వాత, ఈ ఒప్పందం అమలును నిలిపివేసే దిశగా భారత్ సంకేతాలు ఇవ్వడం చరిత్రలోనే మొదటిసారి.

pakistan-defence-minister-khawaja-asif-issues-fiery-threat-to-india-on-indus-waters

భారత్ ఈ చర్యతో పాకిస్థాన్‌లో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. ముఖ్యంగా, సింధూ నదీ జలాలు తగ్గితే తమ వ్యవసాయ రంగం కుప్పకూలుతుందని, అది తమ దేశ ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పు అని పాక్ నేతలకు తెలుసు. ఈ నేపథ్యంలోనే పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ నోరు పారేసుకున్నారు. సింధూ జలాలను మళ్లించేందుకు భారత్ ఏ నిర్మాణం చేపట్టినా దాన్ని ధ్వంసం చేస్తామంటూ నేరుగా, అవాకులు చవాకులు పేలారు.

గతంలో కూడా పాకిస్థాన్ నాయకులు సింధూ జలాలపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. పాక్ మాజీ విదేశాంగ మంత్రి భిలావల్ భుట్టో జర్దారీ అయితే ఒక అడుగు ముందుకేసి, సింధూ నదిలో నీరు పారకపోతే.. రక్తం పారుతుందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సింధూ నది తమదేనని, ఆ ప్రాచీన నాగరికతకు నిజమైన సంరక్షకులం తామేనన్న అహంకారం వారి మాటల్లో స్పష్టంగా కనిపించింది. నీటి లభ్యతపై భవిష్యత్ భయాలు వారిలో ఎంతగా నాటుకుపోయాయో ఈ వ్యాఖ్యలు చాటి చెబుతున్నాయి.

నిపుణుల అంచనాల ప్రకారం, సింధూ జలాల లభ్యత తగ్గితే పాకిస్థాన్ వ్యవసాయ రంగంపై ఇది తీవ్ర, దీర్ఘకాలిక ప్రభావం చూపుతుంది. ఇది ఒకరకంగా పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక విరిచే చర్య అవుతుంది. పహల్గాం దాడి నేపథ్యంలో భారత్ తీసుకున్న ఈ కీలక నిర్ణయం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచింది. తాజాగా పాకిస్తాన్ నుంచి దిగుమతలను నిలిపివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+