వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'కుల్‌భూషణ్ జాదవ్‌ను వెంటనే ఉరి తీయండి'

గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న కుల్‌భూషణ్‌ జాదవ్‌ను త్వరగా ఉరి తీయాలని పాకిస్థాన్‌ సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలైంది.

|
Google Oneindia TeluguNews

కరాచీ: గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న కుల్‌భూషణ్‌ జాదవ్‌ను త్వరగా ఉరి తీయాలని పాకిస్థాన్‌ సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలైంది.

జాదవ్‌కు పాక్‌ సైనిక కోర్టు విధించిన ఉరిశిక్షను అమలు చేయడంలో కింది కోర్టు విఫలమైందని, ఇక ఆలస్యం చేయకుండా జాదవ్‌ను తక్షణమే ఉరితీయాంటూ మాజీ సెనేట్‌ ఛైర్మన్‌, న్యాయవాది ఫరూఖ్‌ నక్‌ శనివారం పిటీషన్‌ను దాఖలు చేశారు.

ఆయన మరణశిక్షపై అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన స్టే విధిస్తూ ఇచ్చిన ఉత్తర్వులు పాకిస్తాన్ చట్టాలపై ఎటువంటి ప్రభావం చూపబోవన్నారు.

Petition in Pakistan Supreme Court seeks immediate execution of Kulbhushan Jadhav

గూఢచర్యం ఆరోపణలతో గతేడాది మార్చి నెలలో జాదవ్‌ను బలూచిస్థాన్‌లో పట్టుకున్నట్లు పాకిస్తాన్ చెబుతోంది. అతడిపై కేసు పెట్టి విచారించిన పాక్‌ సైనిక కోర్టు జాదవ్‌కు మరణశిక్ష విధించింది.

కానీ ఇరాన్‌లో వ్యాపారం చేసుకుంటున్న జాదవ్‌ను అన్యాయంగా పట్టుకొచ్చి గూఢచర్యం ఆరోపణలు చేస్తున్నారని భారత్‌ వాదిస్తోంది. భారత్‌ వాదనలకు పాక్‌ ఆర్మీ మాజీ లెఫ్టినెంట్‌ జనరల్‌ అంజద్‌ షోయబ్‌ మద్దతు పలికారు.

పాక్‌ తీర్పును సవాలు చేస్తూ భారత్‌ అంతర్జాతీయ ఐసీజేను ఆశ్రయించింది. జాదవ్‌ కేసును విచారించిన కోర్టు భారత్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. తదుపరి విచారణ జరిపేంత వరకు పాక్‌ జాదవ్‌కు మరణశిక్ష వాయిదా వేయాలంటూ స్టే విధిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.

English summary
A petition has been filed in Pakistan's Supreme Court seeking immediate execution of Indian prisoner on death row Kulbhushan Jadhav if he failed to get his capital punishment overturned.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X