జస్ట్ మిస్: విమానాన్ని ఢీకొట్టిన డ్రోన్
లండన్: బ్రిటీష్ ఎయిర్ వేస్ కు చెందిన విమానాన్ని అనుమానిత డ్రోన్ ఢీకొనింది. నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే యూరప్ లోని హిత్రూ విమానాశ్రయం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకునిందని బ్రిటీష్ పోలీసు అధికారులు తెలిపారు.
అయితే విమానానికి ఎలాంటి ప్రమాదం జరగలేదని బ్రిటీష్ ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు. డ్రోన్ ఢీకొనడంతో ఉన్నత స్థాయి పోలీసు అధికారుల విచారణ మొదలైయ్యింది. 137 మంది ప్రయాణికులు, విమాన సిబ్బంది ఉన్న ఎయిర్ బస్ ఏ320 ల్యాండ్ అవ్వడానికి సిద్దం అయ్యింది.

అదే సమయంలో అనుమానిత డ్రోన్ విమానాన్ని ఢీకొనింది. విషయం గుర్తించిన పైలెట్ విమానాశ్రయంలోని కంట్రోల్ రూంకు సమాచారం అందించారు. విమానం జెనీవా నుంచి హిత్రూకు వస్తున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుందని ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications