బుల్లెట్ ట్రైన్‌కు జపాన్ ఆర్థిక సాయం .. షింజో తమ పాత స్నేహితుడన్న మోడీ
ఒసాకా : భారతదేశానికి తమవంతు సహాయ సహకారాలు అందిస్తామని జపాన్ తెలిపింది. జీ-20 సదస్సు జపాన్‌లోని ఒసాకాలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ప్రధాని మోడీతో జపాన్ ప్రధాని షింజో అబే చర్చించారు. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును మోడీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందుకు సహకారం అందించాలని మోడీ కోరగా .. జపాన్ సుముఖత వ్యక్తం చేసింది.
బుల్లెట్ ట్రైన్‌కు బాసట ..
ముంబై-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు ప్రాజెక్టు జరుగుతుంది. దీనికి వారణాసి కన్వెక్షన్ చేస్తూ మార్పు చేశారు. ప్రాజెక్టుకు సహకారం అందించేందుకు పాత స్నేహితుడు షింజో అబే అంగీకరించామని మోడీ పేర్కొన్నారు. దీనికి సంబంధించి జపాన్ రూ.79 వేల కోట్ల రుణం భారత్‌కు ఇచ్చేందుకు అంగీకరించింది. జపాన్ సహకారంతో 2022లో బుల్లెట్ ట్రైన్ పట్టాలెక్కుతుందని మోడీ పేర్కొన్నారు. వారణాసి మరియు క్యోటో మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా ప్రపంచ స్థాయి కన్వెన్షన్ సెంటర్‌కు జపాన్ భారత్‌కు సుమారు రూ .200 కోట్లు ఇచ్చింది. 2015లో మోడీ, అబే కలిసి వారణాసిని సందర్శించినప్పుడు ఈ ఒప్పందం జరిగింది.

నేరస్తులపై ఉక్కుపాదం ...
బుల్లెట్ రైలు కోసం ఆర్థిక సహకారంతోపాటు .. ఆర్థిక నేరస్తులను అప్పగించేందుకు కూడా సహకారం అందిస్తామని జపాన్ భరోసా కల్పించింది. ఇవాళ కీలక అంశాలపై షింజో అబేతో మోడీ చర్చించారు. రేపు ట్రంప్, మోడీలతో కూడా వివిధ అంశాలపై డిస్కస్ చేస్తారు అబే. ముఖ్యంగా ఇండో ఫసిఫిక్ రీజియన్‌లో అనుసరించాల్సిన వ్యుహంపై మూడుదేశాల అధినేతల మధ్య ప్రధాన చర్చ జరిగే అవకాశం ఉంది. అంతేకాదు రెండోసారి మోడీ విజయం సాధించాక .. తొలిసారి ఫోన్ చేసి అభినందించింది షింబో అబేనే. ఈ విషయాన్ని మోడీ ప్రత్యేకంగా గుర్తుచేశారు.
-
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో..












Click it and Unblock the Notifications