Narendra Modi: రండి.. పెట్టుబడులు పెట్టండి.. ఆస్ట్రేలియా వ్యాపారవేత్తలకు మోడీ పిలుపు..

ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆ దేశ వ్యాపారులతో భేటీ అయ్యారు. మౌలిక సదుపాయాలు, ఫిన్‌టెక్, టెలికమ్యూనికేషన్స్, సెమీకండక్టర్లు, పునరుత్పాదక ఇంధనం వంటి కీలక రంగాలలో భారతదేశంలో పెట్టుబడి అవకాశాలను ఉపయోగించుకోవాలని కోరారు.

మూడు రోజుల పర్యటన భాగంగా చివరి రోజున సిడ్నీలో అగ్రశ్రేణి ఆస్ట్రేలియా కంపెనీల సీఈఓలతో జరిగిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో మోడీ ప్రసంగించారు. వ్యాపారం చేయడం, ఆర్థిక వృద్ధిని పెంచడం కోసం భారత ప్రభుత్వ ఆర్థిక సంస్కరణలు రూపొందించినట్లు మోడీ గుర్తు చేశారు.

Prime Minister Narendra Modi has called upon Australian businessmen to invest in India

ఈ రౌండ్ టేబుల సమావేశంలో స్టీల్, బ్యాంకింగ్, ఇంధనం, మైనింగ్ ఐటీ కంపెనీల సీఈఓలు పాల్గొన్నారు. ప్రముఖ ఆస్ట్రేలియన్ విశ్వవిద్యాలయాల వైస్-ఛాన్సలర్లు కూడా రౌండ్ టేబుల్‌ సమావేశంలో భాగస్వాములయ్యారు. రియో టింటో, నేషనల్ ఆస్ట్రేలియా బ్యాంక్, వైసెటెక్, ఆస్ట్రేలియన్ ఇండస్ట్రీ బ్యాంక్ సీఈఓలు రౌండ్ టేబుల్‌లో పాల్గొన్నారు.

డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఐటీ, ఫిన్‌టెక్, టెలికమ్యూనికేషన్స్, సెమీకండక్టర్స్, స్పేస్, గ్రీన్ హైడ్రోజన్‌తో సహా పునరుత్పాదక ఇంధనం, విద్య, ఫార్మాస్యూటికల్స్, వైద్య పరికరాలతో సహా ఆరోగ్య సంరక్షణ, కీలకమైన ఖనిజాలతో సహా మైనింగ్, టెక్స్‌టైల్స్, వ్యవసాయం ప్రధాని మాట్లాడారు.

మౌలిక సదుపాయాల కనెక్టివిటీ ప్రాజెక్టులు, జన్ ధన్-ఆధార్-మొబైల్ ట్రినిటీ, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, హైడ్రోజన్ మిషన్ 2050, ప్రొడక్షన్-లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకం కోసం మిషన్ గతి శక్తి వంటి కార్యక్రమాల ద్వారా వ్యాపార వాతావరణంలో వచ్చిన మార్పులను ఆయన ప్రస్తావించారు. స్పేస్, జియోస్పేషియల్ రంగాల్లో ప్రైవేట్ పెట్టుబడికి అవకాసం కల్పిస్తున్నామని చెప్పారు. వైద్య పరికరాల తయారీకి కొత్త విధానం తీసుకొచ్చామని తెలిపారు.

అంతకు ముందు నరేంద్ర మోడీ ఆస్ట్రేలియ ప్రధఆని ఆంథోని ఆల్బనీస్ తో సమావేశమయ్యారు. ఇద్దరు నేతలు సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందంపై చర్చలు జరిపారు.సిడ్నీలోని అడ్మిరల్టీ హౌస్‌లో ఆస్ట్రేలియా గవర్నర్ జనరల్ డేవిడ్ హర్లీతో మోదీ సమావేశమై ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే మార్గాలపై చర్చించారు. ఆస్ట్రేలియా ప్రతిపక్ష నాయకుడు పీటర్ డట్టన్‌తో జరిగిన ప్రత్యేక సమావేశంలో, భారత్-ఆస్ట్రేలియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా పొందుతున్న బలమైన ద్వైపాక్షిక మద్దతును మోడీ ప్రశంసించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+