విషాదం: 92 మందితో వేడుకలకు వెళ్తూ.. సముద్రంలో కూలిన విమానం
రష్యాకు చెందిన ఓ విమానం టేకాఫ్ అయిన కాసేపటికి రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయని తెలుస్తోంది. విమానంలో ప్రయాణీకులు, క్రూ మెంబర్లు ఉన్నారు.
మాస్కో: రష్యాకు చెందిన టియూ 154 విమానం టేకాఫ్ అయిన కాసేపటికి రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి. ఆ తర్వాత అది నల్ల సముద్రంలో కూలిపోయింది. ఈ ఘటనలో 92 మంది మృత్యుువాత పడ్డారు. ప్రమాదం నుంచి ఎవరూ బయటపడలేదని తెలుస్తోంది. ఇది రష్యా డిఫెన్స్ మినిస్ట్రీకి చెందిన విమానం.
ఈ విమానం ఉదయం 5.20 నిమిషాలకు టేకాఫ్ తీసుకుంది. టేకాఫ్ తీసుకున్న ఇరవై నిమిషాల తర్వాత.. అంటే 5.40 మధ్య రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి. సోచి ప్రాంతంలో టేకాఫ్ అయిన తర్వాత సంబంధాలు తెగిపోయాయి. విమానంలో 92 మంది ఉన్నారు.

ఈ విమానం సిరియా మీదుగా వెళ్తుండగా సోచీ ప్రాంతంలో రాడార్ వ్యవస్థ నుంచి మాయమయింది. టేకాఫ్ అయిన రెండు నిమిషాలకే రాడార్ వ్యవస్థ నుంచి విమానం అదృశ్యమైందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. సోచి నగరానికి 1.5 కి.మీ. దూరంలో సముద్రంలో 50 నుంచి 70 మీటర్ల లోతున విమాన శకలాలు గుర్తించినట్లు పేర్కొంది.
గజ ఈతగాళ్లు, మూడు వేలకు పైగా సిబ్బంది, 27 ఓడలు, కొన్ని హెలికాప్టర్లు విమానం, మృతదేహాల అన్వేషణలో పాలుపంచుకుంటున్నాయి. మరోవైపు ప్రమాదంపై విచారణ కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వ కమిషన్‌కు నేతృత్వం వహించమని ప్రధాని దిమిత్రి మెద్వెదేవ్‌ను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశించారు. విమానాన్ని ఉగ్రవాదులు కూల్చి ఉంటారని వస్తున్న అనుమనాలను రష్యా అధికారులు కొట్టపారేశారు. సాంకేతిక లోపం లేదా సిబ్బంది తప్పిదం ప్రమాదానికి కారణమై ఉండొచ్చంటున్నారు.
వేడుకలకు వెళ్తూ..
సిరియాలోని రష్యా వైమానిక స్థావరం హ్మెయిమిమ్‌కు ఈ విమానం పయనమైంది. విమానంలో సైన్య అధికారిక సంగీత బృందానికి చెందిన 64 మంది సభ్యులతోపాటుగా ఇతర సైనికులు, 9 మంది పాత్రికేయులు, ఓ డాక్టర్, 8 మంది విమాన సిబ్బంది ఉన్నారు. హ్మెయిమిమ్‌లో నూతన సంవత్సర వేడుకలో వీరంతా పాల్గొనేందుకు వెళ్తున్నారు.












Click it and Unblock the Notifications