S Jaishankar: జైశంకర్ లండన్ పర్యటనలో భద్రతా లోపం.. ఖలిస్థానీల దాడిని ఖండించిన భారత్
S Jaishankar: విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ యూకే పర్యటన సందర్భంగా భద్రతా లోపాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. లండన్ లోని ఛాఠమ్ హౌస్ బయట ఖలిస్తాన్ మద్దతుదారులు ప్రదర్శన నిర్వహించారు. జైశంకర్ ఆ సమయంలో అక్కడ ఒక చర్చలో పాల్గొంటున్నారు. నిరసనకారులు జెండాలను ఎగురువేసి నినాదాలు చేశారు. ఛాఠమ్ హోస్ లో అధికారిక సమావేశం ముగించుకుని జైశంకర్ బయటకు రాగా.. ఆ సమయంలో కొంత మంది ఖలిస్తానీ నిరసనకారులు కలకలం సృష్టించారు. తమ జెండాలతో నిరసన తెలిపారు. ఓ దుండగుడు ఏకంగా విదేశాంగ మంతి ఎస్.జైశంకర్ కారు వద్దకు దూసుకువచ్చాడు. అతడి చేతిలో ఉన్న భారతీయ జెండాను అవమానించేలా అతను నినాదాలు చేయడం గమనార్హం. లండన్ పోలీసులు వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడితో పాటు మిగతావారందరిని పోలీసులు అక్కడి నుంచి తరిమికొట్టారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఈ ఘటనను భారత సర్కారు తీవ్రంగా ఖండించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇలా పేర్కొంది. "విదేశాంగ మంత్రి యూకే పర్యటన సందర్భంగా భద్రతా ఉల్లంఘనకు సంబంధించిన ఫుటేజీని చూశారు. వేర్పాటువాదులు, తీవ్రవాదుల రెచ్చగొట్టే కార్యకలాపాలను మేము ఖండిస్తున్నాము. అటువంటి శక్తులు ప్రజాస్వామ్య స్వేచ్ఛను దుర్వినియోగం చేయడం ఖండిస్తున్నాం. ఇలాంటి సందర్భాల్లో ఆతిథ్య ప్రభుత్వం తన దౌత్య బాధ్యతలను నిర్వర్తిస్తుందని ఆశిస్తున్నాం. తగిన చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నాం."అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది.

ఖలిస్తానీ నిరసన చేస్తుండగానే..
ఖలిస్తానీల నిరసనలు ఉన్నప్పటికీ జైశంకర్ తన దౌత్య కార్యకలాపాలను కొనసాగించారు. ఆయన యూకే ప్రధానమంత్రి కీర్ స్టార్మర్, విదేశాంగ కార్యదర్శి డేవిడ్ లామీ, ఇతర సీనియర్ నాయకులను కలిశారు. మంగళవారం జైశంకర్ యూకే హోం కార్యదర్శి య్వెట్ కూపర్ ను కలిశారు. వారు మానవ అక్రమ రవాణా, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం వంటి అంశాలపై చర్చించారు.
ఇదే మొదటిసారి కాదు..
ఖలిస్తానీ గ్రూపులు లండనలు నిరసనలు తెలపడం ఇది మొదటిసారి కాదు. జనవరిలో ఖలిస్తానీ అనుకూల తీవ్రవాదులు భారత హైకమిషన్ వెలుపల నిరసన తెలిపారు. మరో ఘటనలో ఖలిస్తానీ గ్రూపులు లండన్ లోని హారోలో ఒక సినిమా థియేటర్ పై దాడి చేశాయి. కంగనా రనౌత్ నటించిన 'ఎమర్జెన్సీ' సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సంఘటనలపై విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఆందోళన వ్యక్తం చేశారు. యూకేలో భారత వ్యతిరేక శక్తుల హింసాత్మక నిరసనలు, బెదిరింపుల గురించి భారత్ ఆందోళన చెందుతోందని ఆయన అన్నారు.
🚨 #Khalistani extremists heckled & attempted to attack EAM S Jaishankar as he left an event at Chatham House #London
— Nabila Jamal (@nabilajamal_) March 6, 2025
A protester tore the Indian flag in front of London police, who appeared unresponsive in a viral video@DrSJaishankar on a UK visit (March 4-9) to strengthen… pic.twitter.com/PfwGUUdVUC
ఉక్రెయిన్ వివాదంపై కూడా చర్చలు..
జైశంకర్ 10 డౌనింగ్ స్ట్రీట్‌లో యూకే ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్‌ను కలిశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తరపున ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఇద్దరు నాయకులు ద్వైపాక్షిక, ప్రపంచ అంశాలపై చర్చించారు. జైశంకర్ మాట్లాడుతూ, 'మా ద్వైపాక్షిక, ఆర్థిక సహకారాన్ని మరింతగా పెంచుకోవడం, ప్రజల మధ్య మార్పిడిని పెంచడం గురించి చర్చించాము.'అని తెలిపారు. ఉక్రెయిన్ వివాదంపై యూకే దృక్పథాన్ని ప్రధాని స్టార్మర్ కూడా పంచుకున్నారు. భారత్-యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం పురోగతిపై కూడా వారు చర్చించారు. ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని పెంచుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం జైశంకర్ యూకే, ఐర్లాండ్ దేశాల దౌత్య పర్యటనలో ఉన్నారు.












Click it and Unblock the Notifications