Maldives: భారత్ తో పెట్టుకుని భారీ మూల్యం చెల్లంచుకుంటున్న మాల్దీవ్స్..
మాల్దీవ్స్.. ఇది ఒక ద్వీప దేశం. దీనికి ప్రధాన ఆర్థిక వనరు పర్యాటకం. మాల్దీవ్స్ ఎక్కువగా భారతీయులు వెళ్తుంటారు. మాల్దీవ్స్ వచ్చే పర్యాటకులు భారత్ నుంచే ఎక్కువ ఉంటారు. మాల్దీవ్స్ వెళ్లే దేశాలు చూసుకున్నట్లయితే భారత్ దే అగ్రస్థానం. అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అక్కడి ప్రమభుత్వం, ఆ దేశ అధ్యక్షుడు, మంత్రులు చేసిన పనులతో మాల్దీవ్స్ భారీ మూల్యం చెల్లించుకుంటుంది.
మాల్దీవ్స్ పర్యటక ర్యాంకింగ్ లో ఇండియా అగ్రస్థానం నుంచి ఆరో స్థానికి చేరింది. దీంతో మాల్దీవ్స్ ఆదాయానికి గండి పడింది. గత సంవత్సరం డిసెంబరు 31 వరకు భారత్ నుంచి 2,09,198 మంది పర్యటకులు ఆ దేశానికి వెళ్లారు. అప్పుడు 11 శాతం వాటాతో ఇండియా అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత రష్యా, చైనాలు ఉన్నాయి. నాలుగో స్థానంలో బ్రిటన్ ఉంది. అయితే ప్రధాన మంత్రి లక్షద్వీప్ పర్యటన సందర్భంగా మోడీపై మాల్దీవ్స్ మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేశారు.

దీంతో భారతీయులు తీవ్రంగా స్పందించారు. బాయికాట్ మాల్దీవ్స్ అంటూ ప్రచారం చేపట్టారు. దీంతో మాల్దీవ్స్ పర్యటనలు చాలా మంది భారతీయులు రద్దు చేసుకున్నారు. దీంతో మాల్దీవ్స్ కు ఇండియా నుంచి వెళ్లే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. జనవరిలో అగ్రస్థానంలో ఉన్న భారత్ ఐదో స్థానానికి రాగా.. మార్చి 3 తర్వాత ఆరోస్థానాకి చేరింది. మాల్దీవ్స్ వెళ్ల భారతీయుల సంఖ్య 28 వేలకు తగ్గింది.
ప్రస్తుతం 12 శాతంతో చైనా అగ్రస్థానంలో ఉండగా.. రష్యా 9.8 శాతం వాటాతో రెండు స్థానంలో ఇటలీ మూడో స్థానంలో యూకే నాలుగో స్థానంలో ఉన్నాయి. జర్మనీ 6.5 శాతంతో ఐదో స్థానంలో ఉండగా.. భారత్ 6.3 శాతంతో ఆరో స్థానంలో ఉంది. మాల్దీవ్స్ ప్రస్తుత అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజు చైనాకు అనుకూలంగా వ్యవహారిస్తున్నారు. మాల్దీవుల నుంచి భారత్ బలగాలను వెనక్కి తీసుకోవాలని డెడ్ లైన్ కూడా విధించారు. ఆ తర్వాత చైనా బలగాలను రప్పించేందుకు సిద్ధమయ్యారు.












Click it and Unblock the Notifications