షాక్: ఆరేళ్లుగా జాబ్‌కు డుమ్మా, ఎవరూ గుర్తించలేదు
లండన్: ఒకరోజు, రెండు రోజులు కాదు.. ఏకంగా ఆరేళ్ల పాటు ఉద్యోగానికి వెళ్లకుండా డుమ్మా కొట్టాడు ఓ వ్యక్తి. ఆరేళ్ల పాటు ఉద్యోగానికి వెళ్లకపోయినప్పటికీ ఎవరూ గుర్తించలేదు! 69 ఏళ్ల జాక్విన్ గర్సియా ఓ వాటర్ కంపెనీలో పని చేస్తున్నాడు.
సుదీర్ఘకాలంగా విధులను నిర్వహిస్తున్న వారికి అవార్డులు ఇవ్వాలని భావించిన సంస్థ జాక్విన్‌ను గుర్తించింది. తీరా చూస్తే అతను ఆరేళ్ల నుంచి ఒక్క రోజు కూడా విధులకు హాజరు కాలేదని తెలుసుకున్నారు. అది తెలుసుకొని అవాక్కవడం వారి వంతయింది.

ఉన్నతాధికారుల మధ్య ఉన్న విభేదాలను ఆసరాగా చేసుకొని విధులకు ఎగనామం పెట్టడం ప్రారంభించాడట. ఇరవై ఏళ్ల పాటు సేవలు చేసిన వ్యక్తిగా అతనికి మొమెంటోను ఇవ్వాలని భావించిన సంస్థ అప్పుడు అసలు విషయాన్ని గుర్తించింది.
ఈ కేసు కోర్టుకు ఎక్కింది. అతని వార్షిక జీతంలో పన్ను మినహాయించి 27 వేల యూరోలను జరిమానా విధించింది. ఈ ఆరేళ్లూ అతను కనిపించకపోయినా వేతనాన్ని చెల్లిస్తూ వచ్చిన కంపెనీకి చివాట్లు పెట్టింది. తాను కార్యాలయానికి వెళితే, అక్కడ పని ఉండటం లేదని, ఆ కారణం చేతనే వెళ్లడం మానేశానని గార్సియా కోర్టుకు తెలిపాడట.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications