మోదీ కంగ్రాట్స్ : డొనాల్డ్ ట్రంప్, ఎన్నికల్లో విజయం తర్వాత విష్ చేసిన పెద్దన్న

న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో విజయదుందుబి మోగించిన నరేంద్ర మోదీకి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. దేశంలోనే కాదు ప్రపంచ దేశాల నుంచి విషెస్ చెప్తున్నారు నేతలు. తాజాగా మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభినందనలు తెలిపారు. అంతకుముందే ఇవాంక ట్రంప్ మోదీని విష్ చేసిన సంగతి తెలిసిందే.

ట్రంప్ కాల్ ..
ప్రధాని నరేంద్ర మోదీకి శనివారం అమెరికా అధ్యక్షుడు నుంచి ఫోన్ వచ్చింది. ఎన్నికల్లో జయకేతనం ఎగరేసిన మోదీని .. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభినందించారు. 'మరోసారి విజయం సాధించి చరిత్ర సృష్టించారు. మీకు, విజయం కోసం పనిచేసిన నేతలకు శుభాకాంక్షాలు అని' ట్రంప్ పేర్కొన్నారు. దేశంలోని వివిధ రాజకీయ పక్షాలు, క్రీడకారులు, ప్రముఖులు ఇప్పటికే మోదీకి కంగ్రాట్స్ తెలిపిన సంగతి తెలిసిందే.

trump congratulate pm modi for victory loksabha polls

వచ్చేనెలలో సమావేశం
జపాన్ లోని ఒకసాలో జూన్ 28,29 తేదీల్లో జీ-20 సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో మోదీ, ట్రంప్ పాల్గొంటారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య ద్వైపాక్షిక సంబంధాలు చర్చకు రానుంది. ప్రపంచ వ్యవహరాలు, ఇతర కీలక అంశాలపై డిస్కస్ చేసే అవకాశం ఉంది. పుల్వామా దాడి తర్వాత .. మసూద్ అజార్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించడంలో అమెరికా చేసిన సాయానికి మోదీ ప్రత్యేకంగా కలిసి ధన్యవాదాలు తెలిపే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+