పాకిస్థాన్‌ కు మేమున్నాం.. భారత్ కు ఆ రెండు దేశాలు బిగ్ షాక్

పాకిస్థాన్ లోని ఉగ్రవాదుల స్థావరాలపై నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ ను ప్రపంచ దేశాలు స్వాగతించాయి. రష్యా, అమెరికా లాంటి పెద్ద పెద్ద దేశాలు ఉగ్రవాదాన్ని ఏరిపారేయాలని ఇప్పటికే తీర్మానించాయి. ఈ క్రమంలో పాకిస్థాన్ కు మద్దతుగా రెండు దేశాలు నిలిచాయి. అవే టర్కీ, అజర్ బైజాన్. ఈ రెండు దేశాలు పాకిస్థాన్ ను సపోర్ట్ చేశాయి. ఆపరేషన్ సిందూర్ ను ఖండించాయి.

ఇరు దేశాలు దౌత్య పరమైన చర్చల ద్వారానే ముందుకు సాగాలని హితవు పలికాయి. ఈ మేరకు టర్కీ, అజర్ బైజాన్ దేశాలు వేరు వేరు ప్రకటనల ద్వారా తమ అభిప్రాయాన్ని వెల్లడించాయి. టర్కీ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ మేరకు ట్వీట్ చేసింది. భారత్- పాకిస్థాన్ మధ్య ఉన్న సంబంధాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం.

భారత్.. పాకిస్థాన్ పై దాడి చేయడం యుద్ధానికి సంకేతం. ఇలాంటి రెచ్చగొట్టే చర్యలను మేము ఖండిస్తున్నాం. అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశాయి. అలాగే ఇరుపక్షాలు సంయమనం పాటించాలని టర్కీ పేర్కొంది. ఏకపక్ష చర్యలకు దూరంగా ఉండాలంది.

Turkey and Azerbaijan Express Support for Pakistan Amid Rising Tensions

మరోవైపు భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరగడంపై తాము ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు అజర్ బైజాన్ విదేశాంగ శాఖ తెలిపింది. పాకిస్థాన్‌పై జరిగిన సైనిక దాడులను ఖండిస్తున్నామని పేర్కొంది. ఈ దాడుల్లో పలువురు పౌరులు కూడా మృతి చెందారని.. పాకిస్థాన్ ప్రజలకు సంఘీభావం తెలుపుతూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది.

ఆపరేషన్ సిందూర్ లో భాగంగా జైషే మహ్మద్ చీఫ్‌ మసూద్‌ అజహర్ కుటుంబసభ్యులు హతం అయ్యారు. ఆయన కుటుంబంలోని 10 మంది, మరో నలుగురు అనుచరులు మరణించినట్లు మసూద్ అజహర్ వెల్లడించాడు. 56 ఏళ్ల మసూద్ అజహర్ ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ గా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి పేర్కొంది.

ఇక పాకిస్థాన్ ప్రతీకారం తీర్చుకునే ప్రమాదం ఉందని రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ థిల్లాన్ పేర్కొన్నారు. మనం అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం తప్పనిసరిగా ఉందని థిల్లాన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అయితే వాళ్ల దాడి భారత పౌరులకు ప్రమాదకరం కాకపోవచ్చని.. పాకిస్థాన్ మాత్రం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+