మోడీ పాక్ పర్యటనపై ఐరాస, అమెరికా ప్రశంసలు
న్యూయార్క్/న్యూఢిల్లీ: పాకిస్థాన్‌లో ప్రధాని నరేంద్ర మోడీ ఆకస్మిక పర్యటనపై జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రశంసలు వెల్లువెత్తాయి. ఇది సృజనాత్మక దౌత్య విధానమని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పేర్కొనగా, వాజపేయి విధానం పాటించారని భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ సూచించారు.
లక్నోలో శనివారం జరిగిన బహిరంగ సభలో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మాట్లాడుతూ.. ‘ప్రధాని మోడీ పాకిస్థాన్ వెళ్లారన్న సంగతి విని మేమంతా ఆశ్చర్యపోయాం. ఆయన సృజనాత్మక విధానానికి దూత అని నేను నమ్ముతున్నాను' అని లక్నోలో శనివారం జరిగిన బహిరంగసభలో చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ సృజనాత్మక దౌత్యవేత్త చెప్పారు.
పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ జన్మ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ప్రధాని మోడీ కాబూల్ మీదుగా పాకిస్థాన్‌లోని లాహోర్ నగరంలో పర్యటించిన విషయం తెలిసిందే. మాజీ ప్రధాని వాజపేయి తర్వాత అంతర్జాతీయంగా భారత్ గౌరవాన్ని పెంపొదిస్తున్న ప్రధాని మోడీ అని రాజ్‌నాథ్ అభివర్ణించారు.

పాక్‌లో ప్రధాని మోడీ పర్యటనను బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ ప్రశంసించారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి మాజీ ప్రధాని వాజపేయి మిషన్‌ను అనుసరించాలని మోడీకి సూచించారు.
భరత ఉపఖండ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల పరివర్తనకు సంకేతమని బిజెపి అధికార ప్రతినిధి ఎంజే అక్బర్ తెలిపారు. పాక్‌లో ప్రధాని మోడీ పర్యటనను నెటిజన్లు స్వాగతించారు.
కాగా, మోడీ, నవాజ్ షరీఫ్ మధ్య భేటీని ఐక్యరాజ్యసమితి(ఐరాస), అమెరికా, చైనా స్వాగతించాయి. మోడీ పర్యటన రెండు దేశాల మధ్య దృఢమైన సంబంధాన్ని నెలకొల్పుతుందని అభిప్రాయపడ్డాయి.
కానీ, బిజెపి మిత్రపక్షం శివసేన మాత్రం.. మోడీ ఆకస్మిక పర్యటన దేశ ప్రతిష్ఠ, విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేసిందని వ్యాఖ్యానించింది. షరీఫ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు అభ్యంతరకర రీతిలో పాక్‌లో పర్యటించినందుకు మోడీ జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. ఇది ప్రభుత్వ రెండు నాల్కల ధోరణికి నిదర్శనమని శివసేన పంజాబ్ శాఖ చైర్మన్ రాజీవ్ టాండన్, అధ్యక్షుడు సంజీవ్ ఘానౌలీ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications