చైనా కు అమెరికా భారీ షాక్.. తొలిసారిగా కాన్సులేట్ మూసివేతకు ఆదేశం.. సీక్రెట్ ఫైల్స్ కాల్చివేత..
అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ చైనాతో విభేదాలు తారా స్థాయికి చేరుతున్నాయి. రెండు దేశాల మధ్య ఇప్పటికే దెబ్బతిన్న బంధాలకు మరో అంశం తోడైంది. ఈసారి ఏకంగా అమెరికా గడ్డపైనున్న చైనా రాయబార కార్యాలయం మూసివేతకు ఆదేశాలు వెలువడటం సంచలనంగా మారింది. టెక్సాస్ రాజధాని హ్యూస్టన్ సిటీలో ఉన్న చైనీస్ కాన్సులేట్ ను 72 గంటల్లోగా ఖాళీ చేయాలని అమెరికా అల్టిమేటం జారీ చేసింది. దీని వెనుక ఆసక్తికర కారణాలుండగా, చైనా మాత్రం అమెరికా చర్యను తీవ్రంగా తప్పుపట్టింది.
Recommended Video

సీక్రెట్ ఫైల్స్ కాల్చివేత?
హ్యూస్టన్ సిటీలోని చైనీస్ రాయబార కార్యాలయం ఉన్న కాప్లెక్సులో మంగళవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. క్యాంపస్ లో నిలిపి ఉంచిన కంటెయినర్లు ఒక్కొక్కటిగా తగలబడటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్మేసింది. ఫైర్ ఫైటర్లు, పోలీసులు రంగంలోకి దిగి మంటల్ని అదుపులోకి తెచ్చారు. చైనా రాయబార కార్యాలయంలోని సీక్రెట్ ఫైళ్లను అక్కడి అధికారులు కావాలని కంటెయినర్లలో ఉంచి తగులబెట్టినట్లుగా రిపోర్టులు వచ్చాయి. ఈ చర్యను తీవ్రంగా పరిగణించిన అమెరికా.. వెంటనే కాన్సులేట్ ను మూసేసి వెళ్లిపోవాల్సిందిగా చైనీస్ అధికారుల్ని ఆదేశించింది.

చైనా ఖండన.. ఎదురుదాడి..
హ్యూస్టన్ లోని రాయబార కార్యాలయం మూసేయాలన్న అమెరికా నిర్ణయాన్ని చైనా తీవ్రస్వరంతో ఖండించింది. ఈ మేరకు జారీ చేసిన అల్టిమేటం ఏకపక్షంగా, రాజకీయ దుగ్ధతో తీసుకున్న నిర్ణయమని మండిపడింది. అసలేం జరిగిందో వివరణ కూడా కోరకుండా, ఏకంగా కాన్సులేట్ మూసేయమనడం సరికాదని, అగ్నిప్రమాదంపై ప్రతిస్పందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపింది. రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం, కరోనా తర్వాతి కాలంలో పరస్పర నిందారోపణలు, సౌత్ చైనా సముద్రం, హాంకాంగ్ భద్రత బిల్లు అంశాలపై ఇరు దేశాలు పరస్పరం బెదిరింపులకు దిగిన నేపథ్యంలో తాజా ఉదంతం మరింత కలవరపెడుతున్నది.

రెచ్చగొట్టొద్దు.. సీరియస్ ఎఫెక్ట్..
‘‘కాన్సులేట్ మూసివేతకు ఆదేశాలిచ్చి అమెరికా చాలా తప్పు చేసింది. ఆ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని మేం కోరుతున్నాం. హ్యూస్టన్ కాన్సులేట్ ను 72 గంటల్లోగా మూసేయాలని మంగళవారం మాకు సమాచారం అందించారు. ఇది కచ్చితంగా అంతర్జాతీయ నిబంధనల ఉల్లంఘనే. ఏకపక్షంగా, రెచ్చగొట్టేలాగా అమెరికా వ్యవహరిస్తున్నది. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలకు కూడా ఇది విరుద్ధం'' అని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ అన్నారు. బుధవారం బీజింగ్ లో మీడియాతో మాట్లాడుతూ ఆయనీ కామెంట్లు చేశారు.

సర్కారు కంటే ముందే మౌత్ పీస్..
అమెరికా, చైనాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశమున్న ‘హ్యూస్టన్ కాన్సులేట్ మూసివేత' అంశంపై డ్రాగన్ సర్కారు ముందే.. చైనా కమ్యూనిస్టు పార్టీ మౌత్ పీస్ గా పేరుపొందిన గ్లోబల్ టైమ్స్ స్పందించడం గమనార్హం. ఆ పత్రిక ఎడిటర్ హూ జీజిన్ చేసిన ట్వీట్ తోనే మిగతా ప్రపంచానికి ఈ వార్త తెలిసింది. ఆయన ట్వీట్ తర్వాత కొన్ని గంటలకుగానీ చైనా విదేశాంగ శాఖ ప్రకటన వెలువడలేదు.

చైనాపై ముప్పేటదాడి..
డ్రాగన్ దేశాన్ని అన్ని రకాలుగా నిలువరించాలని డిసైడైన అమెరికా.. కరోనా వైరస్ మహమ్మారి విషయంలో అమెరికన్ పౌరులు చైనాపై న్యాయపోరాటం చేసేందుకు వీలు కల్పించే బిల్లును సిద్ధం చేసింది. చైనా ప్రభుత్వం లేదా చైనా కంపెనీలపై ఫెడరల్ కోర్టులో అమెరికన్లు కేసులు పెట్టడానికి అనుమతించే బిల్లును.. రిపబ్లికన్ పార్టీకి చెందిన ఆరుగురు సభ్యులు సెనేట్‌లో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు చట్టంగా మారితే చైనాకు మరిన్ని చిక్కుల తప్పవని తెలుస్తోంది. మరోవైపు, భారత్-చైనా వివాదంపై అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో మరోసారి కీలక వ్యవఖ్యలు చేశారు. హిమాలయన్ రీజియన్ లోని ఇతర దేశాలపై చైనా బెదిరింపులకు దిగుతున్నదని, బాధిత దేశాలకు అమెరికా అండగా నిలుస్తుందని, అప్పుడు డ్రాగన్ తోకముడవక తప్పదని ఆయన అన్నారు.
-
US-Iran Talks: అమెరికాతో చర్చల్లో ఇరాన్ కు తొలి విజయం..! బంపర్ ఆఫర్..! -
Hormuz: హార్ముజ్ లో సీమైన్స్ కనిపెట్టలేం..! చర్చల వేళ బాంబుపేల్చిన ఇరాన్..! -
ఏలినాటి శని వెంటాడుతోందా? 'పొంగు శని'ని దర్శించుకుంటే అష్టైశ్వర్యాలే! -
బంగారం ధరల్లో లాభాల మోత -
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్











Click it and Unblock the Notifications