వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

51 off 18 balls: బౌలర్ల ఊచకోత: తెవాటియా టేక్ ఎ బౌ: 29 సిక్సర్లు: ఈ సీజన్‌లో

|
Google Oneindia TeluguNews

షార్జా: రాహుల్ తెవాటియా.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చి పారేసిన ఒకే ఒక్కడు. పంజాబ్ ఆశలపై నీళ్లు చల్లిన ఒకే ఒక్కడు. అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో రికార్డు స్కోరును నెలకొల్పిన ఒకే ఒక్కడు. తన జట్టు గెలవాలంటే 18 బంతుల్లో 51 పరుగులు అవసరం ఉన్న సమయంలో ఊచకోతకు దిగిన ఒకే ఒక్కడు. తెవాతియా బ్యాట్ ఝుళిపించకపోయి ఉంటే మ్యాచ్ ఫలితం వేరుగా ఉండేదనడంలో సందేహాలు అక్కర్లేదు. ఒక్క ఓవర్‌లో అయిదు సిక్సర్లు బాదేయడంతో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. రాయల్స్ వశమైంది.

గట్టిగా పిండేసిన స్మిత్ సేన: చివరి 5 ఓవర్లలో: ఐపీఎల్ చరిత్రలో మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ స్పెల్గట్టిగా పిండేసిన స్మిత్ సేన: చివరి 5 ఓవర్లలో: ఐపీఎల్ చరిత్రలో మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ స్పెల్

ఒక్క మ్యాచ్‌లో 29 సిక్సర్లు..

ఒక్క మ్యాచ్‌లో 29 సిక్సర్లు..

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని షార్జా స్టేడియంలో..రెండు జట్ల హోరాహోరి పోరుకు వేదికగా మారింది. స్టేడియంలో పరుగుల వరద పారింది. రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ మధ్య ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్..సిక్సర్ల వర్షంతో తడిసి ముద్దయింది. ఈ ఒక్క మ్యాచ్‌లో రికార్డు స్థాయిలో 29 సిక్సర్లు నమోదు అయ్యాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020లో అత్యధిక సిక్సర్లు నమోదైన రెండో మ్యాచ్ ఇది. పంజాబ్ ఇన్నింగ్‌లో 11 సిక్సర్లు నమోదు అయ్యాయి. రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్‌లో 18 సిక్సర్లు రికార్డు అయ్యాయి. ఇందులో అత్యధికం సంజు శాంసన్, తెవాటియా బాదినవే. చెరో ఏడు సిక్సర్లు కొట్టారు.

 తెవాటియా..

తెవాటియా..

17 ఓవర్లు ముగిసే సరికి రాజస్థాన్ రాయల్స్ జట్టు స్కోరు.. మూడు వికెట్ల నష్టానికి 173 పరుగులు. గెలవాలంటే మిగిలిన మూడు ఓవర్లలో 51 పరుగులు చేయాల్సిన పరిస్థితి. ఓవర్‌కు సగటున 17 పరుగులు చేస్తే గానీ రాజస్థాన్ రాయల్స్ గెలుపు రుచి చూడదు. ఆ దశలో కేప్టెన్ కేఎల్ రాహుల్.. కరేబియన్ ఫాస్ట్ బౌలర్ షెల్డన్ కాట్రెల్‌కు బంతిని అప్పగించాడు. అదే అతను చేసిన అతిపెద్ద పొరపాటు. ఆ ఓవర్ ఒక్కటీ మ్యాచ్ ఫలితాన్ని శాసించింది. గెలవాల్సిన మ్యాచ్‌ను పంజాబ్‌కు దూరం చేసింది.

Recommended Video

IPL 2020,KKR vs SRH :5 Major Mistakes Done By Sunrisers Hyderabad Against Kolkata Knight Riders
తొలి బంతి నుంచే

తొలి బంతి నుంచే

తెవాటియా ఊచకోత తొలి బంతి నుంచే ఆరంభమైంది. కాట్రెల్ సంధించిన బౌన్సర్‌ను లాంగ్ లెగ్ దిశగా సిక్స్ కొట్టాడు. అనంతరం వరుసగా మూడు బంతులనూ ఫెన్సింగ్ దాటించేశాడు. అయిదో బంతి డాట్ బాల్. వైడ్ లెంగ్త్ బాల్‌ను మళ్లీ సిక్స్‌గా మలిచాడు తెవాతియా. తుఫాన్ లాంటి ఆ ఓవర్ ముగిసే సరికి రాజస్థాన్ రాయల్స్‌కు విజయం మీద ఢోకా లేకుండా పోయింది. 12 బంతుల్లో 21 పరుగులు చేయాల్సిన స్థితికి చేరుకుంది. మహ్మద్ షమీ వేసిన 19వ ఓవర్‌లో మళ్లీ సిక్సులు పడ్డాయి. తొలి బంతికి ఉతప్ప అవుట్ అయ్యాడు. అతని స్థానంలో క్రీజ్‌లోకి దిగిన జోఫ్రా ఆర్చర్.. 2, 3 బంతులను సిక్సర్లుగా కొట్టాడు. ఆ ఓవర్ అయిదో బంతిని తెవాటియా సిక్స్‌గా మలచడంతో రాయల్స్ విజయానికి మరింత చేరువైంది. చివరి ఓవర్‌లో రెండు పరుగులు చేయాల్సి వచ్చింది.

English summary
Rahul Tewatia played the innings of his life, smashing five sixes off Sheldon Cottrell in the 18th over when Royals needed 51 off 18 balls. Though Tewatia wasn't there when his team got home with three deliveries to spare, his 53 (31b, 7x6) had swung it Royals’ way.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X