బావిలో పడ్డ కారు.. నలుగురు సేఫ్, ఒకరు మృతి.. ఎక్కడ అంటే..?
జగిత్యాల జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. రూరల్ మండలం లక్ష్మీపూర్ సమీపంలో గల చిన్నగట్టు వద్ద రోడ్డు పక్కన గల బావిలోకి కారు దూసుకెళ్లింది. కారులో ఐదుగురు ఉన్నారు. నలుగురుని రక్షించగా.. ఒకరు ప్రాణాలను కోల్పోయారు. కారులో ఉన్న ఐదుగురిలో నలుగురు సురక్షితంగా బయటపడగా.. ఒకరు గల్లంతయ్యారు. కారును క్రేన్ సాయంతో బయటకు తీశారు. గల్లంతైన కిషోర్ మృతి చెందాడు. మల్యాల మండలానికి చెందిన చందు తన మిత్రులతో కలిసి శ్రీరాముల పల్లెకు బర్త్ డే పార్టీకి వెళ్లాడు. తిరిగి వస్తున్న క్రమంలో చిన్న గట్టు సమీపంలో గల వ్యవసాయ బావిలోకి కారు దూసుకెళ్లింది.
విషయం తెలిసిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. క్రేన్ సాయంతో కారును బయటకు తీశారు. 6 గంటల పాటు రెస్య్కూ ఆపరేషన్ చేపట్టారు. నలుగురి ప్రాణాలను మాత్రం కాపాడారు. గల్లంతయిన కిషోర్ విగతజీవిగా మారాడు. దీంతో విషాదచాయలు అలుముకున్నాయి. బర్త్ డే కోసం వెళ్లి.. తిరిగిరానీ లోకాలకు వెళ్లాడని నిట్టూరుస్తున్నారు. వారి మిత్రులు కూడా బాధపడుతున్నారు.

ఇదే కాదు చాలా రోడ్డు ప్రమాదాలు జరిగాయి. రోడ్డు పక్కన బావులు ఉండటం ప్రమాదకరం. దానికితోడు అర్దరాత్రి డ్రైవ్ చేయడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా డ్రింక్ చేసి డ్రైవ్ చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. మద్యం సేవించి వాహనాలు నడుపొద్దని పోలీసులు ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదు. తనిఖీ చేసి పట్టుబడితే.. కోర్టుకు వెళ్లి మరీ జరిమానా కడుతున్నారు. కానీ తర్వాత వారిలో మార్పు రావడం లేదు. మరింత కఠినంగా వ్యవహరిస్తే తప్ప ప్రయోజనం ఉండదు. లేదంటే రోజుకో చోట ఇలానే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications