సిరిసిల్లలో మరో 3 ఒమిక్రాన్ కేసులు.. అతని భార్య, తల్లి, స్నేహితుడికి పాజిటివ్..
ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. వైరస్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. రాజన్న సిరిసిల్లలో ఒక కేసు వచ్చిన సంగతి తెలిసిందే. దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ వచ్చింది. దీంతో అతనిని టిమ్స్‌కు తరలించారు. అయితే అతని భార్య, అతని తల్లి, స్నేహితుడి నమూనాలను జినొమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించారు. ఆ రిపోర్ట్ ఇవాళ వచ్చింది. ఆ ముగ్గురికి కూడా ఒమిక్రాన్ వచ్చింది. ఆ ముగ్గురిని టిమ్స్ తరలించారు. వారి కాంటాక్టులను గుర్తించి.. వారికి పరీక్షలు చేస్తున్నారు. ఈ మూడు కేసులతో జిల్లాలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య నాలుగుకి చేరింది.

ఆంక్షలు
హైదరాబాద్‌లో ఉన్న గాంధీలో కూడా పరీక్షలు మొదలుపెట్టారు. ప్రత్యేక కిట్లు తెప్పించిన ప్రభుత్వం.. మొదటి బ్యాచ్ కింద 48 శాంపిల్స్ పరీక్ష జరిపింది. గాంధీ ఆసుపత్రిలో మొదటిసారి చేసిన జీనోమ్ సీక్వెన్స్‌లో అన్ని శాంపిల్స్ నెగిటివ్ ఫలితాలను ఇచ్చాయి. అన్ని కేసుల్లోనూ డెల్టా వేరియంట్ ఆనవాళ్లే ఉన్నాయని గుర్తించారు. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న క్రమంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. డిసెంబర్ 31వ తేదీ నుంచి జనవరి 2వ తేదీ వరకు ఆంక్షలు విధించింది. గుంపులు గుంపులు ఉండొద్దని స్పష్టంచేసింది. తెలంగాణ రాష్ట్రంలో చాపకింద నీరులా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఒక్కోరోజు 10 కేసులు రావడం ఆందోళన కలిగిస్తోంది.

కర్ఫ్యూ
ఒమిక్రాన్ టెన్షన్‌తో నైట్ కర్ఫ్యూ వచ్చేసింది. చాలా రాష్ట్రాలు రాత్రి పూట కర్ప్యూను ప్రకటించాయి. ఒమిక్రాన్ కేసులు మహారాష్ట్ర, ఢిల్లీలో ఎక్కువగా వస్తున్నాయి. దీంతో కర్ఫ్యూ తప్ప మరో మార్గం లేదు. సమ్మర్‌లో లాక్ డౌన్ విధిస్తూ.. కేసులు తగ్గించే ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సారి వింటర్‌లోనే లాక్ డౌన్ లాంటి సిచుయేషన్ వస్తోంది.

నిషేధం
ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక సహా పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ వంటి ఆంక్షలు విధిస్తున్నాయి. ఆ జాబితాలో ఢిల్లీ కూడా చేరింది. అన్నీ రాష్ట్రాలు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌పై ఆంక్షలు విధించాయి. ఇటు ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నిర్మూలన కోసం తెలంగాణ ప్రభుత్వం కూడా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. హైకోర్టు ఆదేశాల మేరకు నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించింది. జనవరి 2వ తేదీ వరకు రాష్ట్రంలో బహిరంగ సభలు, ర్యాలీలు నిషేధించింది.












Click it and Unblock the Notifications