మునుగోడు కాంగ్రెస్ పార్టీదే: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ధీమా
ఇప్పుడు అంతా మునుగోడు బై పోల్ చర్చే.. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడం.. స్పీకర్ ఆమోదించడం చకచకా జరిగిపోయాయి. అసెంబ్లీ కార్యదర్శి ఖాళీగా ఉందని నోటిఫై కూడా చేశారు. అయితే ఇప్పుడు అంతా ఎన్నికపై ఫోకస్ చేశారు. విజయం తమదంటే తమదని అంతా అంటున్నారు. సిట్టింగ్ కాంగ్రెస్ స్థానాన్ని కాపాడుకుంటామని ఆ పార్టీ నేతలు అంటున్నారు.
మునుగోడు సీటు తమదేనని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. మునుగోడులో బీజేపీకి ఓటు అడిగే హక్కు లేదన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎందుకు రాజీనామా చేశారో ఆయనకే తెలియదన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కించపరిచేలా ప్రధాని మోడీ మాట్లాడారని గుర్తుచేశారు. బీజేపీ, టీఆర్ఎస్ తోడు దొంగలేనని ఎద్దేవా చేశారు. మునుగోడు అంతా పొలిటికల్ గేమ్ అన్నారు. రెండో స్థానంలో ఉండేది బీజేపీ, టీఆర్ఎస్ తేల్చుకోవాలని సూచించారు.
Recommended Video


కాంగ్రెస్ పార్టీకి, మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. దీంతో రాజగోపాల్ రెడ్డి రాజీనామాను స్పీకర్ పోచారం ఆమోదించారు. మునుగోడు నియోజకవర్గంలో ఉప ఉన్నిక అనివార్యం అయ్యింది. అన్ని పార్టీలు మునుగోడును దక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎవరికి వాళ్లు మునుగోడును తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
అంతకుముందు జీవన్ రెడ్డి కాంగ్రెస్ లో 'పంచ పాండవులు' మాత్రమే మిగిలారని తెలిపారు. పంచ పాండవుల్లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ధర్మరాజులాంటి వారని అన్నారు. జగ్గారెడ్డి భీముడు, శ్రీధర్ బాబు అర్జునుడు అంటూ చెప్పుకొచ్చారు. మరి నకులుడు..సహదేవుడు ఎవరో మాత్రం చెప్పలేదు. టీఆర్ఎస్ మునిగిపోయే పడవ అని జీవన్ రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications