బంపర్ ఆఫర్: రూ.వెయ్యి డ్రా చేస్తే రూ.2 వేలు, జనం క్యూ, చివరికీ
ఇప్పుడు రోడ్డు మీద రూ.100 నోటు కనిపిస్తే పిలిచి ఇచ్చేవారు కొందరు. తీసుకునేవారు ఎక్కువ మంది.. అందరూ అలాంటి వారు కాదు. కానీ కాలం అలా ఉంది. మరీ ఏటీఎంలో డబ్బులు రెట్టింపు వస్తాయని చెబితే ఊరుకుంటారా..? ఊహు అంటారు. క్యూ కట్టేస్తారు. అలా సిద్దిపేటలో ఓ ఘటన జరిగింది.
సిద్దిపేట బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలో ఇలా జరిగింది. అవును ఓ కస్టమర్ డబ్బులు తీసేందుకు వెళ్లాడు. రూ.వెయ్యికి రెండు వేల వస్తున్నాయి. ఆ వెనకాల ఉన్నవారు.. ఇలా ఒక్కొక్కరు తీసుకున్నారు. వారు ఊరికే ఉంటారా.. అందరికీ చెప్పడంతో క్యూ కట్టారు. ఇదేంటని ఆరా తీయగా విషయం బ్యాంక్ అధికారులకు తెలిసింది.

వారు వెంటనే ఏటీఎం వద్దకు వచ్చి ఆ ఏటీఎం క్లోజ్ చేశారు. దీంతో మిగతా జనం ఊసురుమనేశారు. అయ్యో ఏంటీ ఇదీ అని అంతా అనుకున్నారు. కానీ తొలుత తీసుకున్నవారు ప్రయోజనం పొందారు. కానీ వారి డేటా బ్యాంకు అధికారుల వద్ద ఉందనేది తెలుసుకోవాలి.
నిజానికి ఇప్పుడు అంతా ఆన్ లైన్.. ఫోన్ పే.. లేదంటే గూగుల్ పే వాడుతున్నారు. కొన్ని కొన్ని షాపుల వద్ద తమకు కావాల్సిన నగదును తీసుకుంటున్నారు. దీంతో ఏటీఎం వద్దకు రావడం రేర్.. కానీ అక్కడ జనం ఉండటంతో డౌట్ వచ్చింది. విషయం బ్యాంక్ సిబ్బందికి తెలియడంతో.. వారు ఏటీఎం మూసివేశారు.












Click it and Unblock the Notifications