పాండ్యాకు బీసీసీఐ షాక్: 6 వారాల పాటు విశ్రాంతి

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: కుడి భుజానికి గాయం కారణంగా టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యాకు ఆరు వారాల పాటు విశ్రాంతినిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. పాండ్యా కుడి భుజానికి గాయమైనట్లు బీసీసీఐ మెడికల్ టీం ధ్రువీకరించిన నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.

 మ్యాచ్ ఆడకుండానే గాయపడిన పాండ్యా

మ్యాచ్ ఆడకుండానే గాయపడిన పాండ్యా

ఇంగ్లాండ్ సిరిస్‌తో జట్టులోకి వచ్చిన హార్ధిక్ పాండ్యా మ్యాచ్ ఆడకుండానే గాయపడిన సంగతి తెలిసిందే. మొహాలి టెస్టు ప్రారంభానికి ముందు, నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో పాండ్యా భుజానికి గాయమైంది. స్పెషలిస్టుచే వైద్య పరీక్షలు చేయించుకొని, మెరుగైన చికిత్సను పొందడానికి వీలుగా టెస్టు జట్టు నుంచి పాండ్యాను ఆదివారం విడుదల చేశారు.

వైద్య పరీక్షల నివేదిక తర్వాత బీసీసీఐ నిర్ణయం

వైద్య పరీక్షల నివేదిక తర్వాత బీసీసీఐ నిర్ణయం

పాండ్యా వైద్య పరీక్షల నివేదికలు అందిన తర్వాతే తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని షిర్కే పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాండ్యా కుడి భుజంలో కొద్దిపాటి చీలిక రావడంతో అతడికి ఆరు వారాల పాటు విశ్రాంతి అవసరమని భావించిన బీసీసీఐ మంగళవారం ఈ దిశగా చర్యలు తీసుకుంది.

 ఆదివారం టెస్టు జట్టు నుంచి తప్పిస్తూ నిర్ణయం

ఆదివారం టెస్టు జట్టు నుంచి తప్పిస్తూ నిర్ణయం


ఈ ఏడాది టీమిండియా టీ20, వన్డే జట్టులో అరంగేట్రం చేసిన హార్ధిక్ పాండ్యా ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరిస్‌కు ఎంపికయ్యాడు. అయితే భుజానికి గాయం కావడంతో టెస్టు జట్టు నుంచి అతడిని బీసీసీఐ తప్పించింది. జనవరి 15 నుంచి ఇంగ్లాండ్‌తో ప్రారంభం కానున్న వన్డే సిరిస్‌కు కూడా హార్ధిక్ పాండ్యా అందుబాటులో ఉండే అవకాశం లేదని తెలుస్తోంది.

 ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్‌కు అందుబాటులోకి

ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్‌కు అందుబాటులోకి


అయితే వచ్చే ఏడాది స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్‌కు పాండ్యా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరిస్‌లో ఓపెనర్ కేఎల్ రాహుల్, వికెట్ కీపర్ సాహా కూడా గాయపడిన సంగతి తెలిసిందే.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Young all-rounder Hardik Pandya has sustained a hairline fracture on his right shoulder following which he will be out of action for six weeks.
Please Wait while comments are loading...