బెంట్లీ కారు ప‌క్క‌నే నిల‌బ‌డి ఫొటో: ఆడుకున్న ఫ్యాన్స్‌!

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: పాకిస్థాన్ క్రికెట‌ర్ ఉమ‌ర్ అక్మ‌ల్‌ను సోషల్ మీడియాలో నెటిజన్లు ఆడుకున్నారు. ఇందుకు కారణం అక్మల్ పెట్టిన ఫోటోనే. గ‌త కొంత కాలంగా ఫామ్ కోసం తంటాలు ప‌డుతూ జట్టులో స్థానం కోల్పోయిన అక్మ‌ల్‌.. ప్ర‌స్తుతం లండ‌న్‌లో ఉన్నాడు.

జట్టులోనే కాకుండా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) విడుదల చేసిన జాతీయ కాంట్రాక్ట్ జాబితాలో కూడా ఉమర్ అక్మల్ పేరు లేదు. ఇలాంటి సమయంలో అక్మల్‌ ఖరీదైన బెంట్లీ కారుతో దిగిన ఫొటోని తన ట్విటర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. 'ఎంతో కఠినమైన శిక్షణ అనంతరం లండన్‌లో ఎంజాయ్‌ చేస్తున్నాను' అని అక్మల్‌ ఫొటో కింద కామెంట్ పెట్టాడు.

అక్మ‌ల్ అనుకున్న‌ది ఒక‌టి.. జరిగింది మ‌రొక‌టి. ట్విట్ట‌ర్‌లో అభిమానులు సీరియ‌స్‌గా స్పందించారు. నువ్వు కష్టపడుతున్నావా? అని ఒక అభిమాని పేర్కొనగా, 'బెంట్లీ కారు కొనేంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి. ఇది నీ కారు కాదు. ఇతరుల కారు వద్ద నిల్చుని ఫొటో దిగావు' ఒక నెటిజిన్ పేర్కొన్నాడు.

'భవిష్యత్తులో క్యాబ్‌ డ్రైవర్‌గా స్థిరపడేందుకు శిక్షణ పొందుతున్నావా, ప్రస్తుత జట్టులో నువ్వు లేవు' అని మరొక నెటిజన్ పేర్కొన్నాడు. 'క్రికెట్‌ పై దృష్టి పెట్టి జట్టులో స్థానం సంపాదించు' అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

వీటిపై అక్మల్‌ మాత్రం తనదైన శైలిలో స్పందించాడు. 'నా అభిమానులందర్నీ ప్రేమిస్తున్నాను. మీ అందరికీ ఒక విన్నపం. దయచేసి నాపై నెగిటివ్‌ కామెంట్లు ఆపండి. మీ ప్రార్థనలు, మద్దతు నాకు ఎంతో అవసరం' అని పేర్కొన్నాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Umar Akmal has time and again split opinion right down the middle in Pakistan with his inconsistent performances over the years. Dubbed as the next big thing to come out of Pakistan cricket, the right-handed batsman has failed to live up to his billing and realise his potential.
Please Wait while comments are loading...