న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్ ఓటమి: బాగా ఆడినా టార్గెట్ ధోనియే, ఎందుకు?

By Nageshwara Rao

హైదరాబాద్: ఫిరోజ్ షా కోట్లా మైదానంలో భారత్, న్యూజిలాండ్ మధ్య గురువారం జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ చేతిలో భారత్ 6 పరుగుల తేడాతో ఓటిమి పాలైంది. 243 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా లక్ష్య ఛేదనలో టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమవ్వడంతో భారత్ పరాజయం పాలైంది.

దీంతో ఐదు వన్డేల సిరిస్‌ 1-1తో సమం అయింది. అయితే రెండో వన్డేలో భారత్ ఓటమికి కెప్టెన్ ధోనియే కారణమంటూ వార్తలు వచ్చాయి. భారత్‌కు చెందిన ప్రముఖ న్యూస్ ఏజెన్సీ పీటీఐ సైతం తన వార్తా కథనంలో "Dhoni flops as India lose to NZ by six runs" అని రాసింది.

కొంతమంది ధోని వ్యతిరేకులు సైతం దీనికి మద్దతు తెలిపారు. విమర్శించే వారికి ఫలాజా ఏజెండా అంటూ ఏమీ ఉండదు. నోటికి ఏది వస్తే అదే మాట్లాడతారు. టాప్ ఆర్డర్ విఫలం కాగా ధోని ఇన్నింగ్స్‌ని చక్కదిద్దే క్రమంలో రెండో వన్డేలో 39 పరుగులు చేశాడు.

Unfair to blame captain Dhoni for 2nd ODI defeat

తొలి వన్డేలో రాణించినా కోహ్లీ రెండో వన్డేలో 9 పరుగులకే పెవిలియన్‌కు చేరాడు. అయితే రెండో వన్డేలో కోహ్లీది 'ప్లాప్ షో' అంటూ విమర్శకులు ప్రస్తావించక పోవడం విశేషం. అయితే ధోనినే ఎందుకు టార్గెట్ చేస్తున్నారనే విషయం మాత్రం అర్ధం కావడం లేదు.

అయితే ఇందుకు కారణం లేకపోలేదు. వన్డేల్లో మ్యాచ్ ఫినిషర్‌గా ధోనికి పేరుంది. రెండో వన్డేలో టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలం కావడంతో ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన ధోనిపై అందరూ నమ్మకం పెట్టుకున్నారు. దీంతో ధోని మ్యాచ్‌ని ఎలాగైనా గెలిపిస్తాడనే విశ్వసించారు.

18.4 ఓవర్లకు గాను 3 వికెట్లు కోల్పోయి జట్టు స్కోరు 72 ఉన్నప్పుడు ధోని ఐదో స్ధానంలో బ్యాటింగ్‌కు దిగాడు. 39.3 ఓవర్‌లో 39 పరుగులు చేసి పెవిలియన్ కు చేరాడు. ఈ సమయంలో జట్టు 6 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. ఈ సమయంలో భారత్ గెలవడానికి 71 పరుగులు అవసరమయ్యాయి.

కేదార్ జాదవ్‌తో కలిసి 66 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆ తర్వాత అక్షర పటేల్‌తో కలిసి 33 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ధోని స్ట్రయిక్ రేట్ 60తో (65 బంతుల్లో 39 పరుగులు) ఉన్న వ్యతిరేకులు మాత్రం విమర్శిస్తున్నారు.

Photos : new zealand tour of india 2016

మ్యాచ్ ఓటమి అనంతరం మీడియాతో మాట్లాడిన ధోని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. రెండో వన్డేలో ఏ ఒక్క బ్యాట్స్ మెన్ కూడా ఆశించిన స్థాయిలో ఆడకపోవడమే ఓటమికి ప్రధాన కారణమని తెలిపాడు. లక్ష్యాన్ని ఛేజ్ క్రమంలో భాగస్వామ్యాలు నమోదైనా, ఆ భాగస్వామ్యం వచ్చింది అనుకునే లోపే వికెట్లను కోల్పోవడం ఓటమిపై ప్రభావం చూపిందని చెప్పాడు.

Unfair to blame captain Dhoni for 2nd ODI defeat

'నేను భారీ షాట్లు ఆడదామని అనుకున్నప్పుడల్లా మా వికెట్ పడింది. ఇలాంటి పరిస్థితుల్లో బ్యాటింగ్ చేయడం చాలా కష్టం. రెండో ఎండ్‌లో కూడా మంచి సహాయం లభిస్తే భారీ భాగస్వామ్యాలు ఏర్పర్చడానికి సాధ్యమవుతుంది.' అని అన్నాడు. పరుగులు చేయకుండా వికెట్లు కోల్పోవడం మాకు ఇబ్బందిగా మారిందని అన్నాడు.

'భారీ షాట్‌లు ఆడాలనుకున్నా': ఆ అనాలోచిత షాట్ వల్లే భారత్ ఓటమి

'వికెట్లు చేతిలో ఉంటే ఓవర్‌కు ఆరు, ఏడు పరుగులు సాధించడం అంత కష్టమేమీ కాదు. మా ఓటమికి ప్రధాన కారణం మాత్రం స్వల్ప విరామాల్లో వికెట్లను కోల్పోవడమే. ఇది ఒక్క బ్యాట్స్ మెన్ ను ఉద్దేశించి చెప్పడం లేదు. మొత్తం జట్టంతా బ్యాటింగ్ లో వైఫల్యం చెందింది. నేను జట్టు గెలుపుకోసం 10 శాతం మించి కృషి చేశానని ఏ ఒక్క బాట్య్‌మెన్ అయినా చెప్పగలడా?' అని ధోని ప్రశ్నించాడు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X