సెమీస్: నార్త్ఈస్ట్ ఆశలు మిగిలే ఉన్నాయ్

Posted By:
Subscribe to Oneindia Telugu

గౌహతి: చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితిలో నార్త్ఈస్ట్ యునైటెడ్ జట్టు బుధవారం సాయంత్రం ఢిల్లీ డైనమోస్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 2 - 1 స్కోర్ తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా ప్లేఆఫ్ దశలో చేరికపై తన ఆశలు సజీవంగా నిలుపుకున్నది. సైత్యాసేన్ సింగ్ 60వ నిమిషంలో, ఎన్'డ్రి రోమరిక్ 71వ నిమిషంలో గోల్స్ సాధించడంతో నార్త్ఈస్ట్ ఆధిక్యం పొందింది.

అదనపు సమయంలో రెండో నిమిషంలో ఢిల్లీ డైనమోస్ సంచలనం మార్సిలిన్హో పెరీరా చేసిన గోల్‌తో స్కోర్ 2 - 1 తేడాతో నార్త్ఈస్ట్ విజయం సాధించి 18 పాయింట్లతో ఐదోస్థానంలో నిలిచింది. తదుపరి జరిగే మ్యాచ్‌లో తలపడే కేరళ బ్లాక్ బస్టర్స్ 19 పాయింట్లతో నాలుగోస్థానంలో ఉన్నది.

కోచిలో ఆదివారం జరిగే మ్యాచ్ ఫలితం.. టాప్ 4 లో నాలుగో స్థానంలో నిలబడే జట్టును ఖరారుచేస్తుంది. కోచిలో జరిగే మ్యాచ్ ఫలితాన్ని డ్రా గా ముగించినా కేరళ ప్లేఆఫ్ దశకు క్వాలిఫై అవుతుంది. నార్త్ఈస్ట్ జట్టుతో తలపడిన ఢిల్లీ డైనమోస్ ఓటమి పాలైనా 13 మ్యాచ్ లలో 20 పాయింట్లతో రెండోస్థానంలో ఉండటంతో ప్లేఆఫ్ దశకు అర్హత సాధించింది.

పాజిటివ్ ద్రుక్పథంతో ఢిల్లీ కుర్రాళ్లు

పాజిటివ్ ద్రుక్పథంతో ఢిల్లీ కుర్రాళ్లు

విజిటర్స్ జట్టుగా ఢిల్లీ కుర్రాళ్లు తొలి నుంచి ప్రత్యర్థి జట్టుకు ఎటువంటి అవకాశమివ్వకుండా పాజిటివ్ ద్రుక్పథంతో ముందుకు సాగారు. మూడో నిమిషంలో ఆధిక్యం సాధించే అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయారు. రిచర్డ్ గాడ్జె మీదుగా సారధి ఫ్లోరెంట్ మాలౌదా పంపిన బంతిని.. ప్రత్యర్థి జట్టు డిఫెన్స్ అడ్డుకొనేందుకు చేసిన ప్రయత్నం విఫలమైనా.. గోల్ కీపర్ టి రెహెనేశ్ అడ్డుకున్నాడు.

అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం

అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం

నార్త్ఈస్ట్ ప్లేయర్లు సైతం తమకు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగంచేసుకోవడానికి విఫలయత్నంచేశారు. 18వ నిమిషంలో ఎమిలియానో అల్ఫారో గోల్ చేసే అవకాశం పొందాడు. ఢిల్లీ డైనమోస్ డిఫెన్స్ నుంచి ఫాస్ట్‌గా రోమరిక్ పంపిన బంతిని అల్ఫారో అంతే వేగంగా గోల్ పోస్ట్ దారి మళ్లించినా కీపర్ టోని దోబ్లాస్ తిరగొట్టాడు. ఫస్టాఫ్ ముగిసేలోగా నార్త్ఈస్ట్ యునైటెడ్ జట్టు తన అవకాశాన్నిసద్వినియోగం చేసుకోలేకపోయింది.

సెకండాఫ్‌లో నార్త్ఈస్ట్ తొలిగోల్

సెకండాఫ్‌లో నార్త్ఈస్ట్ తొలిగోల్

రౌల్లిన్ బోర్గెస్ పంపిన బంతిని సైత్యాసేన్ సింగ్ గోల్ పోస్ట్ దారి మళ్లించేలోగా ప్రత్యర్థి గోల్ కీపర్ అడ్డుకున్నాడు. సెకండాఫ్ సెషన్‌లో నార్త్ఈస్ట్ ఎటువంటి ఇబ్బందుల్లేకుండా తొలి గోల్ చేసింది. జట్టు సారధి డిడియర్ జొకొరో 61వ నిమిషంలో దూరం నుంచి పంపిన బంతిని సైత్యాసేన్ సింగ్ నేరుగా కీపర్ స్పందించేలోగా గోల్ పోస్ట్‌కు చేర్చడంతో నార్త్ఈస్ట్ ఖాతాలో తొలి గోల్ నమోదైంది. సరిగ్గా మళ్లీ పది నిమిషాలకు రెండో గోల్ చేసే అవకాశం చిక్కడంతో నార్త్ఈస్ట్ సద్వినియోగంచేసుకున్నది.

నార్త్ఈస్ట్ డబుల్ గోల్స్ లీడ్

నార్త్ఈస్ట్ డబుల్ గోల్స్ లీడ్

రాబర్ట్ కుల్లెన్ పర్‌ఫెక్ట్‌గా క్యాలిక్యులేషన్స్‌తో పంపిన బంతిని మిడ్ ఫీల్డ్ లో ఉన్న రోమరిక్ ఎటువంటి పొరపాటు లేకుండా ఔట్ సైడ్ నుంచి చక్కగా గోల్ పోస్ట్‌కు చేర్చడంతో నార్త్ఈస్ట్ డబుల్ గోల్స్ లీడ్ సాధించింది. రెండు గోల్స్ ఆధిక్యంతో డిఫెన్స్ లో ముందు ఉన్న నార్త్ఈస్ట్.. అదనపు సమయంలో రెండో నిమిషంలో ఢిల్లీ సంచలనం మార్సిలిన్హో పెరీరా గోల్ చేసే అవకాశం కల్పించింది. దీంతో ఢిల్లీ డైనమోస్ జట్టుపై నార్త్ఈస్ట్ విజయం సాధించింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
NorthEast United FC warmed up for their do-or-die battle ahead with an encouraging 2-1 victory over Delhi Dynamos in their penultimate Hero Indian Super League clash at Indira Gandhi Athletic Stadium here yesterday.
Please Wait while comments are loading...