రెండేళ్లలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు మిలియన్ ఫాలోయర్లు
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌లో అనుసరించే వారి సంఖ్య ఒక మిలియన్‌కు చేరుకుంది.
హైదరాబాద్: జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌లో అనుసరించే వారి సంఖ్య ఒక మిలియన్‌కు చేరుకుంది. ఆయన రెండేళ్ల క్రితం ఖాతాను ప్రారంభించారు. 2014 ఆగస్టులో ఆయన ట్విట్టర్‌లో చేరారు.
నాటి నుంచి నేటి వరకు ఆయన ఫాలోయర్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పుడు ఒక మిలియన్ చేరుకుంది. పవన్ కళ్యాణ్‌కు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు కర్నాటక, తమిళనాడులలోను భారీగా ఉంటారు.

ఆయన ట్విట్టర్లో చాలా తక్కువగా ట్వీట్లు చేస్తుంటారు. ప్రధానంగా రాజకీయ, సామాజిక అంశాల పైన ఆయన ట్విట్టర్ ద్వారా స్పందిస్తారు. రాజధాని అమరావతి భూములు, ప్రత్యేక హోదా.. ఇలా పలు అంశాలపై ఆయన స్పందించారు. తాజాగా ఆదివారం నోట్ల రద్దుతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కూడా ఆయన ప్రస్తావించారు.
కాగా, ప్రస్తుతం ఆయన కాటమరాయుడు సినిమా షూటింగ్‌లో ఉన్నారు. అన్నపూర్ణా స్టూడియోలో షూటింగ్ జరుగుతోంది. డాలీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో శృతిహాసన్ కథానాయిక. పవన్ కళ్యాణ్ 2019లో ఏపీ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించారు కూడా.












Click it and Unblock the Notifications