ప్రేమించుకొన్నారు, సహజీవనం చేశారు, మర్చిపో అంటూ ప్రియుడి మేసేజ్ ..

పదేళ్ళుగా ప్రేమించుకొన్నారు. కలిసే జీవిస్తున్నారు. వివాహం చేసుకోవాలని నిర్ణయించుకొన్నారు. అమ్మాయి కుటుంబసభ్యులు కూడ ఒప్పుకొన్నారు.అయితే నన్ను మర్చిపో అంటూ ప్రియుడు మేసేజ్ పెట్టి అదృశ్యమయ్యాడు.

హైదరాబాద్: పదేళ్ళుగా ప్రేమించుకొన్నారు. కొద్దిరోజులుగా కలిసే ఉంటున్నారు. త్వరలోనే పెళ్ళి చేసుకొందామని నిర్ణయించుకొన్నారు. ఇరు కుటంబాల పెద్దలు కూడ ఈ పెళ్ళికి ఒప్పుకొన్నారు.అయితే ఇంతలోనే ప్రియుడు అదృశ్యమయ్యాడు.దీంతో ప్రియురాలు పోలీసులను ఆశ్రయించింది.

సికింద్రాబాద్ కు చెందిన ఓ యువతి పదేళ్ళుగా గుంటూరులో చదువుకొంది. అక్కడే పాపయ్య అలియాస్ డేవిడ్ పరిచయమయ్యాడు.వీరిద్దరూ ప్రేమించుకొన్నారు.

ఇద్దరూ కలిసి హైద్రాబాద్ నగరంలో ఓ ఇల్లు అద్దెకు తీసుకొని సహజీవనం చేస్తున్నారు.ఈ విషయం తల్లిదండ్రులకు తెలిసింది. వీరిద్దరి వివాహానికి వారు కూడ ఒప్పుకొన్నారు.

a lady complaint against her lover in hyderabad

డేవిడ్ అలియాస్ పాపయ్యకు ఐదుతులాల బంగారం, మూడు లక్షల రూపాయాల నగదును ఇస్తామని అమ్మాయి కుటుంబసభ్యులు చెప్పారు.

ఇద్దరికి కూడ త్వరలోనే వివాహం చేయాలని నిర్ణయించారు కుటుంబసభ్యులు. అయితే పదిరోజుల నుండి డేవిడ్ అలియాస్ కన్పించకుండా పోయాడు. ఆయన ఎక్కడకు వెళ్ళాడో ఎవరికీ తెలియడం లేదు.

హఠాత్తుగా డేవిడ్ సెల్ ఫోన్ నుండి ఆ యువతికి గురువారం నాడు ఓ మేసేజ్ వచ్చింది. నేను నిన్ను పెళ్లిచేసుకోను.నన్ను మర్చిపో అంటూ మేసేజ్ పెట్టాడు.

ఈ మేసేజ్ చూసిన ఆ యువతి డేవిడ్ కు ఫోన్ చేసింది.అయితే డేవిడ్ ఫోన్ స్విఛ్చాఫ్ చేసి ఉంది. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+