హైదరాబాద్‌లో ఐఎస్ ఉగ్ర శిక్షణ: ఎఫ్‌బీలో పోస్ట్ చేసిన లెక్చరర్ మృతి

హైదరాబాద్: నగరంలో మరోసారి ఐఎస్ కలకలం సృష్టించింది. సోషల్ మీడియాలో ఓ లెక్చరర్ ఐసిస్‌ను ప్రస్తావిస్తూ చేసిన పోస్టుతో.. నగరంలో మళ్లీ ఐసిస్ కదలికలపై చర్చ జరుగుతోంది. హైదరాబాద్ చాదర్‌ఘాట్‌లోని ఎంఎస్ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్న ప్రవీణ్‌కుమార్(28) గత మంగళవారం సాయంత్రం 5.30గంటలకు కళాశాల నుంచి వెళ్లాడు.

కాగా, అదే రోజు వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రి వద్ద బుధవారం రాత్రి 9.30 గంటలకు లారీ ఢీకొని మరణించారు ప్రవీణ్‌కుమార్‌ (28). కాగా, అతని మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పోలీసులు 304-ఏ కింద రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు కేసు నమోదు చేశారు. కుటుంబ సభ్యులకు విషయం తెలియజేయగా వారు గురువారం ఉదయం మృతదేహాన్ని తీసుకెళ్లారు. ప్రవీణ్‌ స్వస్థలం మెదక్‌ జిల్లా తొగుట మండలంలోని బండారుపల్లి. మొదట ప్రవీణ్‌ లారీ ఢీకొట్టడంతోనే మృతి చెందారని భావించారు. ఇంతలో ఆయన ఫేస్‌బుక్‌లో పోస్టు చేసిన కొన్ని సందేశాలు మిత్రుల ద్వారా బయటపడ్డాయి.

A lecturer killed in a road accident

తాను పనిచేస్తున్న హైదరాబాద్‌ మలక్‌పేటలోని ఎంఎస్‌ అకాడమీ విద్యార్థుల్ని ఉగ్రవాదులుగా తయారుచేయడానికి కుట్రపన్నుతోందని, అకాడమీ నుంచి తనకు ప్రమాదం పొంచి ఉందని, హైదరాబాద్‌లో ఐఎస్‌ఐఎస్‌ శిక్షణ సంస్థ పని చేస్తోందని అందులో పేర్కొన్నారు.

తనకు ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే దానికి కారణం ఎంఎస్‌ అకాడమీ అనే సంచలన పోస్టులు బహిర్గతం అయ్యాయి. పోస్టులు పెట్టిన రోజునే లారీ ఢీకొని ప్రవీణ్‌ మృతిచెందడంపై బంధువులు, మిత్రులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రవీణ్‌ మృతిపై సమగ్రంగా విచారణ జరపాలని ,ఫేస్‌బుక్‌లో వచ్చిన వివాదాస్పద పోస్టింగులపై అనుమానాలు వ్యక్తం చేస్తూ కుటుంబసభ్యులు మట్టెవాడ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ప్రవీణ్‌ వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయంలోనే ఎమ్మెస్సీ ఆర్గానిక్‌ పూర్తి చేశారు. దానికి సంబంధించిన పత్రాలను తీసుకెళ్లడానికి బుధవారం ఇక్కడికి వచ్చి ఉంటారని బంధువులు చెబుతున్నారు.ఈ సందర్భంగా ప్రవీణ్‌ స్నేహితుడు అమర్‌ మాట్లాడుతూ.. తామిద్దరమూ చిన్ననాటి స్నేహితులమని చెప్పారు.

గ్రామానికి ఎప్పుడు వచ్చినా తనతో చాలా స్నేహంగా ఉండేవాడన్నారు. అబద్ధాలు చెప్పేవాడు కాదని...కానీ రెండు నెలలుగా మాత్రం భిన్నమైన ప్రవర్తనను గమనించామన్నారు. కనీసం గ్రామానికి వచ్చినా... తనను పలకరించకుండానే వెళ్లిపోయేవాడన్నారు.

అలా ఎందుకు ఉంటున్నాడో తనకు అర్థం కాలేదన్నారు. ప్రస్తుతం జరిగిన పరిణామాలన్నింటినీ పరిశీలిస్తే.. కచ్చితంగా ఏదో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు తమకు అర్థమవుతోందన్నారు. ఈ విషయంలో వాస్తవాలను వెలికితీయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

కాగా, హైదరాబాద్ నగరంలోని బాగ్‌లింగంపల్లి ఉంటున్న కె ప్రవీణ్‌కుమార్ ఎంఎస్సీ చదివారు. జూన్ 2013లో ముషీరాబాద్‌లోని ఎంఎస్ కళాశాలలో కెమిస్ట్రీ లెక్చరర్‌గా చేరారు. రెండేళ్ల క్రితం అక్కడి నుంచి చాదర్‌ఘాట్‌లోని ఎంఎస్ కళాశాలకు బదిలీ అయ్యారు.

లెక్చరర్ ప్రవీణ్ ఎవరితో మాట్లాడే వారు కాదని, కళాశాలలో సిన్సియర్‌గా విధులు నిర్వహించేవాడని ఎంఎస్ కళాశాల డైరెక్టర్ ఎంఎం హసన్ తెలిపారు. ఇదిలావుండగా ప్రవీణ్ ట్విట్టర్‌పై దర్యాప్తు జరుపుతున్నట్టు చాదర్‌ఘాట్ పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+