వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాత్రి 11గంటలకు ఫోన్ చేసి ఏడ్చింది: రిషికేశ్వరి తల్లిదండ్రులు

|
Google Oneindia TeluguNews

వరంగల్/గుంటూరు: తమ కూతురు రిషికేశ్వరికి చదువంటే ప్రాణమని ఆమె తల్లిదండ్రులు చెప్పారు. రిషికేశ్వరి ఆత్మహత్యపై ఆమె తల్లిదండ్రులు గురువారం స్పందించారు. రిషికేశ్వరికి చదువంటే ప్రాణమని, ఇన్నాళ్ల‌లో ఒక్కసారి కూడా కాలేజిలో ఇబ్బందిగా ఉందని చెప్పలేదని వారు చెప్పారు.

కానీ, ఇద్దరు అమ్మాయిలు ర్యాగింగ్‌ చేస్తున్నారంటూ ఓ రోజు రాత్రి 11.30కి రిషికేశ్వరి ఫోన్‌ చేసిందని రిషికేశ్వరి తల్లి దుర్గాబాయి ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడుతూ తెలిపారు. ప్రిన్సిపాల్‌ ర్యాగింగ్‌ను కంట్రోల్‌ చేయలేకే తమ కూతరు తమకు దూరమైందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రిన్సిపాల్‌కి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చెప్పారు. ఘటనపై ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు తక్షణమే స్పందించారని రిషికేశ్వరి తల్లిదండ్రులు తెలిపారు. తమ కూతురు ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని సిఎంను కోరామని చెప్పారు.

A one night phoned and cried my daughter, says Rishikeshwari Mother

కాలేజీ మేనేజ్‌మెంట్‌ను మార్చాలని సిఎం చంద్రబాబుకు సూచించామని వారు చెప్పారు. న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారని రిషికేశ్వరి తల్లి దుర్గాబాయి తెలిపారు.

సీనియర్ల వేధింపులు తట్టుకోలేక ఇటీవల రిషికేశ్వరి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కాగా, ఘటనపై విచారణ కొనసాగుతోంది.

English summary
Rishikeshwari Mother on Thursday said that a one night phoned and cried her daughter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X