ప్రాణంగా ప్రేమించా: ఫోన్లో మాట్లాడుతూనే 5అంతస్తుల భవనంపైనుంచి దూకిన టెక్కీ
తను ప్రేమించిన యువతి తనకు దూరమైందన్న మనస్తాపంతో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డారు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ఈ విషాదం చోటు చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు..
హైదరాబాద్: తను ప్రేమించిన యువతి తనకు దూరమైందన్న మనస్తాపంతో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డారు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ఈ విషాదం చోటు చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ జరుపుతున్నారు.
వివరాల్లోకి వెళితే.. వరంగల్ జిల్లా డోర్నకల్ సమీపంలోని గొల్లచర్ల గ్రామానికి చెందిన అంజయ్య కుమారుడు జగదీష్(26) ఇంజినీరింగ్ పూర్తిచేసి మాదాపూర్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. కాగా, అతడికి తానుండే ప్రాంతంలోని ఓ యువతితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది.

తన ప్రేమ విషయాన్ని జగదీశ్ ఆ యువతికి చెప్పాడు. అయితే వేరే వ్యక్తితో ప్రేమలో ఉన్నట్లు యువతి చెప్పడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే జగదీశ్ 5అంతస్థుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
కాగా, చనిపోయే ముందు యువతితో తనను ప్రేమించాలంటూ ఫోన్‌లో మాట్లాడినట్లుగా తెలుస్తోంది. అప్పటికీ ఆ యువతి ఒప్పుకోకపోవడంతో ఫోన్‌లో మాట్లాడుతూనే భవనంపై నుంచి దూకేశాడు. యువతితో పాటు జగదీశ్ ఇంటి వాచ్‌మెన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.












Click it and Unblock the Notifications