వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అలగాల్సిన అవసరం ఏంటీ?: కిషన్ రెడ్డికి క్లాస్ పీకిన అమిత్ షా

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే కిషన్ రెడ్డికి క్లాస్ తీసుకున్నారు. మంగళవారం ఉదయం ఆర్అండ్ బీ గెస్ట్ హౌజ్‌కు పిలిపించుకుని మాట్లాడారు.

|
Google Oneindia TeluguNews

నల్గొండ: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే కిషన్ రెడ్డికి క్లాస్ తీసుకున్నారు. మంగళవారం ఉదయం ఆర్అండ్ బీ గెస్ట్ హౌజ్‌కు పిలిపించుకుని మాట్లాడారు. సోమవారం సమావేశంలో పిలుస్తున్నా సభా వేదికపైకి ఎందుకు రాలేదని కిషన్ రెడ్డిని షా ప్రశ్నించారు.

అలగాల్సిన అవసరం ఏంటీ?

అలగాల్సిన అవసరం ఏంటీ?

అలగాల్సిన అవసరం ఏంటీ అని కిషన్ రెడ్డిని అమిత్ షా నిలదీశారు. ఎవరికి వారు కాదు, పార్టీ కోసం అందరూ పనిచేయాలని హితవు పలికారు. ఇది అందరికీ వర్తిస్తుందని ఆయన చెప్పారు.

కిషన్, లక్ష్మణ్ విభేదాలు

కిషన్, లక్ష్మణ్ విభేదాలు

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్, కిషన్ రెడ్డిల మధ్య స్వల్ప విభేదాలు చోటు చేసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే సోమవారం అమిత్ షా నిర్వహించిన సమావేశంలో సభా వేదికపైకి కిషన్ రెడ్డి రాలేదు.

ఎక్కడా కనిపించని కిషన్

ఎక్కడా కనిపించని కిషన్

అంతేగాక, షా పక్కన గానీ, వేదికపైన గానీ కిషన్ రెడ్డి కనిపించలేదు. అమిత్ షా పర్యటనకు హాజరైనప్పటికీ కిషన్ ఇలా ప్రవర్తించడంపై అమిత్ షా సీరియస్ అయినట్లు తెలిసింది.

దళితవాడలో అమిత్ షా

దళితవాడలో అమిత్ షా

ఇది ఇలా ఉండగా, నల్గొండ జిల్లాలోని వెలుగుపల్లిలో మంగళవారం ఉదయం అమిత్ షా పర్యటించారు. అక్కడి దళితవాడలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ విగ్రహాన్ని షా ఆవిష్కరించారు. దళితవాడకు దీన్ దయాళ్ ఉపాధ్యాయు కాలనీగా పేరు పెట్టారు. ఆ తర్వాత చిన్నమదారంలో నిర్వహించిన సమావేశంలో అమిత్ షా పాల్గొన్నారు.

English summary
It is said that BJP national president Amit Shah on Tuesday serioused on MLA Kishan Reddy's behaviour.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X