హైదరాబాద్‌లో కర్ణాటక సెగ: గాంధీ భవన్ ముట్టడి: అరెస్టులు- ఉద్రిక్తత
హైదరాబాద్: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తోంది. ఈ నెల 10వ తేదీన పోలింగ్ జరుగనుంది. రాష్ట్రంలోని 224 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే దఫాలో పోలింగ్‌ను నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల కమిషన్. 13వ తేదీన ఓట్ల లెక్కింపును షెడ్యూల్ చేసింది. కర్ణాటకలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది తేలిపోయేది ఆ రోజే. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ తమ ప్రచార తీవ్రతను పెంచాయి.
ఈ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోను మంగళవారమే విడుదల చేసిన విషయం తెలిసిందే. తాము అధికారంలోకి వస్తే- తీసుకోవాల్సిన చర్యల గురించి ఇందులో ప్రస్తావించారు. విధ్వేషాలను రెచ్చగొట్టే మత సంస్థలపై కఠిన చర్యలను తీసుకుంటామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. బజరంగ్ దళ్, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) పేర్లను ఇందులో చేర్చింది. బజరంగ్ దళ్, పీఎఫ్ఐ వంటి సంస్థలను నిషేధిస్తామని ప్రకటించింది.

ఇది- దేశవ్యాప్తంగా బజరంగ్ దళ్ నాయకులు, ప్రతినిధులను ఆగ్రహావేశాలకు కారణమైంది. కాంగ్రెస్ పార్టీపై వారంతా విరుచుకుపడుతున్నారు. ఇస్లామీకరణలో భాగంగాన కాంగ్రెస్ పార్టీ తమపై నిషేధాన్ని విధిస్తామని ప్రకటించిందంటూ భగ్గుమంటోన్నారు. ఈ హామీని వెంటనే ఉపసంహరించుకోవాలంటూ డిమాండ్ చేస్తోన్నారు. కర్ణాటకలో బజరంగ్ దళ్ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ మేనిఫెస్టో కాపీలను దగ్ధం చేశారు.
#WATCH | Telangana: Police detain Bajrang Dal members protesting against Congress' Karnataka election manifesto, in front of party office in Hyderabad.
— ANI (@ANI) May 3, 2023
The Congress has announced a ban on Bajrang Dal on the lines of PFI in its Karnataka Election 2023 manifesto. pic.twitter.com/NKTi61eaM6
ఇక తాజాగా- బజరంగ్ దళ్ నాయకులు హైదరాబాద్‌లో ఆందోళనకు దిగారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం గాంధీ భవన్‌ను ముట్టడించే ప్రయత్నం చేశారు. ఈ మధ్యాహ్నం పెద్ద ఎత్తున వేర్వేరు వాహనాల్లో తరలివచ్చిన బజరంగ్ దళ్ నాయకులు ఒక్కసారిగా నాంపల్లికి బయలుదేరి వెళ్లారు. గాంధీ భవన్‌ను ముట్టడించారు. కాషాయ జెండాలను పట్టుకుని మూకుమ్మడిగా గాంధీ భవన్ లోనికి చొచ్చుకుని వెళ్లడానికి ప్రయత్నించారు.
ఈ పరిస్థితులు తలెత్తుతాయని గుర్తించిన హైదరాబాద్ పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. గాంధీ భవన్‌కు భారీ భద్రత కల్పించారు. ఇనుప బ్యారికేడ్లను అమర్చారు. వాటన్నింటినీ దాటుకుంటూ బజరంగ్ దళ్ నాయకులు గాంధీ భవన్‌లోకి దూసుకెళ్లడానికి ప్రయత్నించారు. గాంధీ భవన్ వద్ద రోడ్డుపై బైఠాయించారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జై శ్రీరామ్ అంటూ నినదించారు. దీనితో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి.

వారిని శాంతింపజేయడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలేవీ ఫలించకపోవడంతో వారిని అరెస్ట్ చేశారు. ఆ సమయంలో బజరంగ్ దళ్ నాయకులు, పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. అరెస్టుల నుంచి తప్పించుకుని గాంధీ భవన్‌లోకి దూసుకెళ్లడానికి ప్రయత్నించిన వారిని పోలీసులు వెంబడించి మరీ అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్టులను బజరంగ్ దళ్ జాతీయ కన్వీనర్ నీరజ్ దొనేరియా తప్పు పట్టారు. మతం పేరుతో కాంగ్రెస్ సమాజాన్ని విభజించిందంటూ ధ్వజమెత్తారు.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!












Click it and Unblock the Notifications