సత్తుపల్లి జిల్లా కోసం బంద్
సత్తుపల్లి: సత్తుపల్లిని జిల్లాగా ప్రకటించాలని నినాదాలతో సత్తుపల్లి టౌన్ మారుమోగిపోయింది. సత్తుపల్లి జిల్లా సాధన జె.ఎ.సి ఆద్వర్యంలో గత 20 రోజులుగా సత్తుపల్లిని జిల్లా చేయాలని రిలే నిరాహార దీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా సత్తుపల్లిని జిల్లాగా ప్రకటించాలని నగరంలోని అన్ని విద్యాసంస్థలు, వ్యాపార సంస్ధలు యాజమాన్యాలు స్వచ్చందంగా బంద్ లో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications