Basara IIIT: నిర్మల్‍లో ఉద్రిక్తత.. భాను ఆత్మహత్యపై అనుమానాలెన్నో..!
బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పీయూసీ 2 చదువుతున్న భాను ప్రసాద్ సూసైట్ నోట్ రాసి ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిర్మల్ ఆస్పత్రికి తరలించారు. ప్రభుత్వ హాస్పిటల్ మార్చురీ దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. భాను ప్రసాద్ కుటుంబానికి న్యాయం చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. బీజేపీ, ఏబీవీపీ నేతలు ఆస్పత్రిలోకి చొచ్చుకెళ్లారు. ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో జిల్లా ఆస్పత్రి దగ్గర పోలీసులను భారీగా మోహరించారు. బీజేపీ, ఏబీవీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మూడు రోజుల క్రితమే
అయితే భాను ప్రసాద్ మృతిపై అతని తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గదిలో నుంచి దుర్వాసన వచ్చే వరకు సిబ్బంది మృతదేహాన్ని గుర్తించకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తమ కుమారుడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని చెబుతున్నారు. మూడు రోజుల క్రితమే భాను ఆత్మహత్య చేసుకున్నా..క్యాంపస్ అధికారులు ఎవరూ చెప్పలేదని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

రాథోడ్ సురేశ్
గత ఆగస్ట్ లో కూడా బాసర ట్రిపుల్ ఐటీలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కళాశాలలో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ (ఈ-1) చదువుతున్న రాథోడ్ సురేశ్(22) గోదావరి హాస్టల్ భవనంలోని తన గదిలో మంగళవారం ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సురేశ్ ఉదయం సహచర విద్యార్థులతో కలిసి బ్రేక్‌పాస్ట్ చేసిన అతను క్లాసులకు వెళ్లకుండా రూమ్ లోనే ఉన్నాడు. అనంతరం గదిలోనే ఆత్మహత్య చేసుకున్నాడు.

కేటీఆర్
గతంలో తమ సమస్యలు పరిష్కరించాలని బాసర ట్రిఫుల్ ఐటీలో విద్యార్థులు ధర్నాలు చేశారు. అనంతరం ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ బాసర ట్రిఫుల్ ఐటీలో పర్యటించి విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. ఆ తర్వాత డిసెంబర్ లో కూడా బాసర ట్రిఫుల్ ఐటీకి వచ్చారు.












Click it and Unblock the Notifications