Bomb Threat: శంషాబాద్ ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు.. నిజం తెలిసి దిమ్మతిరిగిపోయింది!
Bomb Threat: ఇటీవల కాలం బాంబు బెదిరింపులు అధికమైపోయాయి. హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్పోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు వచ్చింది. సైబరాబాద్ కంట్రోల్ రూమ్ కు ఓ ఆగంతకుడు ఫోన్ చేసి శంషాబాద్ ఎయిర్పోర్టులో బాంబు ఉందంటూ సమాచారం ఇచ్చారు. వెంటనే అప్రమత్తమైన ఎయిర్పోర్టు భద్రతా సిబ్బంది ముమ్మర తనిఖీలు చేపట్టారు. అడుగడుగునా చెక్ చేసిన అనంతరం బాంబు లేదని భద్రతా సిబ్బంది నిర్ధారించుకున్నారు.
ఆ తర్వాత కాల్ ఎక్కడ నుంచి వచ్చిందని తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఆ కాల్ ఫేక్ అని తేల్చాక.. కాల్ చేసిన వ్యక్తి గురించి తెలిసి అధికారులకు దిమ్మదిరిగిపోయింది. కాల్ చేసిన వ్యక్తి తెలంగాణలోని కామారెడ్డి వాసిగా.. సదరు వ్యక్తికి మతిస్థిమితం లేదని గుర్తించారు. మొత్తానికి బాంబు బెదిరింపు కాల్ ఫేక్ అని తేలడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు భద్రతా బలగాలు రెడ్ అలర్ట్ ప్రకటించాయి. రిపబ్లిక్ డే నేపథ్యంలో భద్రతా బలగాలు అలర్ట్ కావడంతో పాటు.. శంషాబాద్ నిఘా విభాగం అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. జనవరి 30 వరకు ఎయిర్ పోర్టుకు సందర్శకులెవ్వరూ రావద్దని కీలక ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. ఇలాంటి చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు కాల్ రావడంతో భద్రతా సిబ్బంది ఒక్కసారిగా అలర్ట్ అయి.. ఎక్కడికక్కడ ముమ్మర తనిఖీలు నిర్వహించారు.
ఎయిర్పోర్టులోకి బాంబు ఎలా వచ్చిందన్న కోణంలో కూడా తనిఖీలు చేపట్టారు. చివరకు కాల్ చేసిన వ్యక్తి గురించి ఆరా తీస్తే.. అతనికి మతిస్థిమితం లేదని తెలియడంతో అధికారులకు దిబ్బతిరిగిపోయింది. మరోవైపు.. గతంలో కూడా ఇలాంటి ఫేక్ కాల్స్ చాలానే వచ్చాయి. ఫేక్ కాల్స్ చేసే వారిపై పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా.. ఫేక్ కాల్స్ చేయడం మాత్రం మానట్లేదు.












Click it and Unblock the Notifications