ఎవరివి వారికే: బిజెపిపై బాబు, గ్రేటర్ బాధ్యత సుజనాకు, 'ఆంధ్రా కులాల్ని తొలగించారు'
హైదరాబాద్: గత గ్రేటర్ ఎన్నికల్లో ఏ పార్టీ నెగ్గిన డివిజన్లను వారికే కేటాయించాల్సి ఉంటుందని తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు బుధవారం స్పష్టం చేశారు. తెలంగాణ టిడిపి ఆయన సమావేశమయ్యారు. జిహెచ్ఎంసి ఎన్నికల పైన చర్చించారు.
పొత్తు ఉన్నందునా డివిజన్ల పంపకాలపై బిజెపితో చర్చించే బాధ్యత సుజనా చౌదరి నేతృత్వంలో తెలంగాణ నేతలకు అప్పగించారు. గత ఎన్నికల్లో టిడిపి 45, బిజెపి 5 డివిజన్లలో నెగ్గాయి. ఈ స్థానాలన్నీ ఎవరివి వారికే ఉంటాయని చెప్పారు.
మిగిలిన వంద డివిజన్లను పంచుకోవడంపై బిజెపితో చర్చించి అవగాహనకు రావాలని సూచించారు. ఏమైనా సమస్యలు వస్తే బిజెపితో మాట్లాడతానని చెప్పారు. నిజాం కళాశాల మైదానంలో నిర్వహించిన సభతో ప్రజల్లో మంచి స్పందన వచ్చిందని ఈ సందర్భంగా నేతలు చంద్రబాబుకు చెప్పారు.

చంద్రబాబును నగరంలో ప్రచారానికి రావాలని టిడిపి నేతలు కోరారు. వీలునుబట్టి రెండు రోజుల ప్రచారానికి వస్తానని చెప్పారు. ఆంధ్రాకు చెందిన 26 కులాల వారిని బీసీ జాబితా నుంచి తెలంగాణ ప్రభుత్వం తొలగించిందని, దీనిపై ఆ వర్గాల్లో అసంతృప్తి ఉందని, దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలు అభిప్రాయపడ్డారు.
కాగా, బిజెపి నేతలు బండారు దత్తాత్రేయ, రామచంద్రారెడ్డి, లక్ష్మణ్‌లు బుధవారం చంద్రబాబు నివాసానికి వచ్చి కలిశారు. వరంగల్ జిల్లా కమలాపురంలోని రేయాన్స్ పరిశ్రమకు సాయపడాలని చంద్రబాబును కోరినట్లు వారు మీడియాకు చెప్పారు.












Click it and Unblock the Notifications