Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇలాంటి దేశాన్ని చూస్తే భయమేస్తోంది: నాగ్‌పూర్‌లో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

నాగ్‌పూర్: దేశం మారాల్సిన సమయం వచ్చేసిందని.. ఆలోచన తీరు మారకపోతే ఎన్నికలు ఎన్ని వచ్చినా ఎలాంటి మార్పూ రాదన్నారు బీఆర్ఎస్ పార్టీ అధినే, తెలంగాణ సీఎం కేసీఆర్. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. భారతదేశానికి లక్ష్యం ఉందా? లక్ష్యం లేని దేశం ఎక్కడికి వెళ్తోంది. ఈ విషయం ఆలోచిస్తే తనకు భయమేస్తోందని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

దేశంలో ఎలాగైనా ఎన్నికల్లో గెలవడమే కొందరి లక్ష్యంగా మారింది. ఎన్నికల రాజకీయతంత్రంలో దేశం చిక్కుకుపోయింది. ప్రతి ఎన్నికల్లో నేతలు కాదు.. జనం గెలివాలి అని కేసీఆర్ అన్నారు. ఎన్నికల్లో జనం గెలిస్తే సమాజమే మారుతుంది. దేశ ప్రజలు చంద్రుడు, నక్షత్రాలు కోరట్లేదు.. నీళ్లు ఇవ్వమని కోరుతున్నారన్నారు కేసీఆర్. మహారాష్ట్రలోనే కాదు.. దేశ రాజధానిలోనూ ఇదే దుస్థితి ఉందన్నారు. మహారాష్ట్ర దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రమని.. కానీ, అలాంటి రాష్ట్రంలోని ఔరంగాబాద్‌లో 8 రోజులకు ఒకసారి తాగునీరు వస్తుందన్నారు.

 Change will happen from Maharashtra to country: BRS party office inaugurated by KCR in Nagpur

స్వాతంత్ర్యం వ‌చ్చి ఇన్నేళ్ల‌యినా ప్ర‌జ‌ల స్థితిగ‌తులు మార‌లేదు. మహారాష్ట్ర సంగ‌తి ప‌క్క‌కు పెట్టండి.. దేశ రాజ‌ధాని ఢిల్లీలోనూ అదే దుస్థితి. గంగా, య‌మునా డెల్టా ప్రాంత‌మైన ఢిల్లీలోనూ ఇదే దుస్థితి ఉంది. ఢిల్లీలో తాగునీరే కాదు.. విద్యుత్ కొర‌త స‌మ‌స్య కూడా ఉంద‌ని కేసీఆర్ తెలిపారు. ఇటీవల కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఓడింది. కాంగ్రెస్ గెలిచింది. పరిస్థితుల్లో మార్పు రానప్పుడు ఎవరు గెలిచి ఏం ప్రయోజనం? ఇప్పటికైనా జనం గెలిచే రాజకీయాలు చేయాలి. బరాక్ ఒబామా అధ్యక్షుడు అయ్యాకే అమెరికాలో జాతి వివక్ష పాప ప్రక్షాళన జరిగిందన్నారు కేసీఆర్.

మ‌హారాష్ట్ర‌లో అనేక పార్టీల నుంచి సీఎంలు వ‌చ్చార‌ని పేర్కొన్న కేసీఆర్.. ఈ రాష్ట్ర ప‌రిస్థితుల‌ను మాత్రం ఏ సీఎం కూడా మార్చ‌లేద‌న్నారు కేసీఆర్. ప్రస్తుతం మ‌న దేశంలో ద‌ళితుల ప‌రిస్థితి ఏంటి..? ఎస్సీల ప‌రిస్థితులు మార‌నంత కాలం దేశం అభివృద్ధి చెంద‌దు. దేశంలో ద‌ళితుల‌, ఆదివాసీల ఉద్ధ‌ర‌ణ జ‌రిగి తీరాల్సిందేనని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఇప్ప‌టికీ వేల టీఎంసీల నీరు వృథాగా స‌ముద్రంలో క‌లుస్తోంద‌ని కేసీఆర్ చెప్పారు.

ప్ర‌పంచంలో భార‌త్‌లోనే ఎక్కువ శాతం సాగు యోగ్య‌మైన భూమి ఉంది. మ‌నం త‌లుచుకుంటే దేశంలోని ప్ర‌తి ఎక‌రాకు సాగునీరు ఇవ్వొచ్చు. భ‌గ‌వంతుడు ఎన్నో వ‌న‌రులు స‌మృద్ధిగా ఇచ్చినా ప్ర‌జ‌ల‌కు ఎందుకీ క‌ష్టాలు. జ‌ల విధానం స‌మూలంగా మారితేనే మార్పు సాధ్య‌మ‌వుతుంది. విద్యుత్ విష‌యంలోనూ ఎన్నో స‌మ‌స్య‌లు ఉన్నాయి. దేశంలో బొగ్గుకు కొర‌త లేదు, అయినా విద్యుత్ స‌మ‌స్య ఉంది. దేశంలోని బొగ్గుతో 150 ఏళ్లు విద్యుత్ ఇవ్వొచ్చ‌ని కోల్ ఇండియానే చెప్పింది. వ్య‌వ‌సాయానికి స‌రిప‌డ క‌రెంట్ ఇవ్వ‌డం లేదు.

గ‌తంలో తెలంగాణ‌లో మ‌హారాష్ట్ర కంటే ఎక్కువ‌గా రైతు ఆత్మ‌హ‌త్య‌లు జ‌రిగేవి. ఇప్పుడు తెలంగాణ‌లో సాగుకు 24 గంట‌ల ఉచిత విద్యుత్ ల‌భిస్తోంది. పుష్క‌లంగా సాగునీరు కూడా అందిస్తున్నాం. తెలంగాణ‌లో రైతుల ఆత్మ‌హ‌త్య‌లు గ‌ణ‌నీయంగా త‌గ్గిపోయాయని కేసీఆర్ వివరించారు. తెలంగాణలా చేస్తే మహారాష్ట్ర దివాలా తీస్తుందని కొందరు నేతలు అంటున్నారని.. తెలంగాణ తరహాలో చేస్తే మరాటా నేతలే దివాలా తీస్తారని కేసీఆర్ అన్నారు. మహారాష్ట్రలో తెలంగాణ నమూనా పాలన వచ్చే వరకు బీఆర్ఎస్ పోరాడుతుందన్నారు కేసీఆర్. మహారాష్ట్రలో చాలా మంది నేతలు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారన్నారు. మహారాష్ట్రలో త్వరలోనే పరివర్తన వస్తుందని.. అది దేశమంతా పాకుతుందన్నారు కేసీఆర్. పుణె, ఔరంగాబాద్‌లలో కూడా బీఆర్ఎస్ కార్యాలయాలు ప్రారంభిస్తామని తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+