కేంద్రం గుడ్ న్యూస్: హైదరాబాదీయుల దశాబ్దాల కల నెరవేరింది..!!
Secunderabad Cantonment: హైదరాబాద్‌కు.. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ ఇచ్చింది. హైదరాబాదీయులు దశాబ్దాలుగా ఎదురు చూస్తోన్న సమస్యను చిటికెలో పరిష్కరించింది. ఈ మేరకు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసింది.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ పరిధిలో ఉన్న పౌర, ఆర్మీయేతర ప్రాంతాలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో విలీనం చేస్తోన్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు రక్షణ మంత్రిత్వ శాఖ ఓ నోటిఫికేషన్ ఇచ్చింది. వాటిని డీ- నోటిఫై చేసినట్లు వెల్లడించింది. ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్ హేమంత్ యాదవ్.. దీనిపై సంతకం చేశారు.

ఇకపై సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని పౌర ప్రాంతాలు, వార్డులు ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి వస్తాయి. వాటిపై కంటోన్మెంట్ బోర్డ్ అధికారుల పర్యవేక్షణ ఉండబోదు. ఆయా ప్రాంతాలు, వార్డులు కూడా తమ సమీప మున్సిపాలిటీల్లోకి విలీనం అయ్యాయి. దీనిపై జీహెచ్ఎంసీ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.
ఇటీవలే తన ఢిల్లీ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్ కంటోన్మెంట్ సహా సంబంధిత మంత్రిత్వ శాఖలో పెండింగ్‌లో ఉన్న అంశాలు ఈ సందర్భంగా వారి మధ్య చర్చకు వచ్చాయి. వాటిని పరిష్కరించడానికి రాజ్‌నాథ్ సింగ్ హామీ ఇచ్చారు. ఈ భేటీ ముగిసిన రెండురోజుల్లోనే ఉత్తర్వులు వెలువడ్డాయి.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ మాత్రమే కాకుండా.. దేశవ్యాప్తంగా ఇతర బోర్డు పరిధిలో ఉన్న సివిల్ ఏరియాలను కూడా ఆయా మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లల్లో విలీనం చేయడానికి అనుమతి ఇచ్చింది రక్షణ మంత్రిత్వ శాఖ. ఈ జాబితాలో 12 కంటోన్మెంట్ బోర్డులు ఉన్నాయి.
మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్, ఔరంగాబాద్, కథ్రూర్ దేవ్‌లాలి, కంప్టీ, ఖడ్కీ, పుణేల్లోని కంటోన్మెంట్ బోర్డులు ఆయా మున్సిపాలిటీల్లో విలీనం కావడానికి రక్షణ మంత్రిత్వ శాఖ అంగీకరించింది. రాజస్థాన్‌లోని నజీరాబాద్, అజ్మీర్, బబినా- ఉత్తరప్రదేశ్, బెళగావి- కర్ణాటక, మధ్యప్రదేశ్‌లోని మొరార్, సాగర్ బోర్డులు ఈ జాబితాలో ఉన్నాయి.












Click it and Unblock the Notifications