వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీతో తగాదాల్లేవు, ఏపీతో ఇంకా వివాదం: ముంబైలో కేసీఆర్ ఆసక్తికరం

|
Google Oneindia TeluguNews

ముంబై: మహారాష్ట్రతో తమకు ఎలాంటి తగాదాలు లేవని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో ఇంకా తమకు జల వివాదాలు సమసిపోలేదని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మంగళవారం నాడు చెప్పారు. మహారాష్ట్రతో చారిత్రక ఒప్పందం సందర్భంగా ఆయన మాట్లాడారు.

ఇప్పుడు రెండు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉన్నాయని కేసీఆర్ చెప్పారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్టులను పట్టించుకోలేదన్నారు. తమ్మిడిహెట్టితో మహారాష్ట్రతో జరిగే నష్టానికి మేడిగడ్డ బ్యారేజీ వద్ద ప్రతిపాదించామన్నారు.

'మహా' ఒప్పందం: హరీష్ కీలక పాత్ర, ఫడ్నవీస్‌ను గుర్తుంచుకుంటాం... కేసీఆర్

ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పందం దేశానికి ఆదర్శం అన్నారు. అంతర్రాష్ట్ర ప్రాజెక్టుల పైన రెండు రాష్ట్రాల మధ్య ఎన్నోసార్లు చర్చలు జరిగాయన్నారు. మూడు ప్రాజెక్టులపై ఒప్పందం కుదిరిందన్నారు. తెలంగాణకు జరిగిన అన్యాయం ఏమిటో దేశం మొత్తానికి తెలుసునని చెప్పారు.

మీతో తగాదాల్లేవు, ఏపీతో ఇంకా వివాదాలే: కేసీఆర్

మీతో తగాదాల్లేవు, ఏపీతో ఇంకా వివాదాలే: కేసీఆర్

నీళ్లు, నిధులు, నియామకాలే తమ ఉద్యమ ప్రధాన నినాదం అని చెప్పారు. కేంద్ర, రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఈ ప్రాజెక్టులు పూర్తి కాలేదని చెప్పారు. తమ్మిడిహెట్టి ప్రాజెక్టు నీటిని అదిలాబాద్ జిల్లాకు మాత్రమే ఉపయోగిస్తామని చెప్పారు.

మీతో తగాదాల్లేవు, ఏపీతో ఇంకా వివాదాలే: కేసీఆర్

మీతో తగాదాల్లేవు, ఏపీతో ఇంకా వివాదాలే: కేసీఆర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో జలజగడం ముగిసిపోలేదన్నారు. ఎన్నోసార్లు చర్చలు జరిగాయన్నారు. గత సమైక్య పాలనలో వివాదం సమసిపోవద్దని భావించారన్నారు. కానీ మేం స్నేహహస్తంతో వచ్చామని మొదటే మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌కు చెప్పామని, ఆయన కూడా అంగీకరించారని చెప్పారు.

మీతో తగాదాల్లేవు, ఏపీతో ఇంకా వివాదాలే: కేసీఆర్

మీతో తగాదాల్లేవు, ఏపీతో ఇంకా వివాదాలే: కేసీఆర్

ఎవరికీ నష్టం జరగకుండా ముందుకెళ్తున్నామని చెప్పారు. మహారాష్ట్రతో తాము ఎప్పుడూ సఖ్యతతోనే ఉంటామని చెప్పారు. స్నేహపూర్వక వాతావరణంలో ఇరు రాష్ట్రాల మధ్య సంబంధాలు బలపడుతాయన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంలో ఇరు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకుంటేనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు.

మీతో తగాదాల్లేవు, ఏపీతో ఇంకా వివాదాలే: కేసీఆర్

మీతో తగాదాల్లేవు, ఏపీతో ఇంకా వివాదాలే: కేసీఆర్

దేశమంతా నీటి యుద్ధాలు జరిగిన సమయంలో మహారాష్ట్ర, తెలంగాణలు పరస్పర సహకారంతో ముందుకు పోతున్నాయని చెప్పారు. తాము నీటి కోసం అరవై ఏళ్లుగా పోరాడుతూ వచ్చామని చెప్పారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ.. ఈ ఒప్పందం వల్ల ఇరు రాష్ట్రాలకు లబ్ధి చేకూరుతుందన్నారు.

English summary
Telangana Chief Minister KCR interesting comments in Mumbai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X