Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలంగాణ గ్రూప్-2 అభ్యర్థులకు బిగ్ రిలీఫ్: పరీక్షలు వాయిదా, మళ్లీ ఎప్పుడంటే?

హైదరాబాద్: పరీక్షలు వాయిదా వేయాలంటూ నిరసనలు చేపట్టిన గ్రూప్-2భారీ ఊరట లభించింది. పరీక్షలు వాయిదా వేయాలన్న గ్రూప్-2 అభ్యర్థుల విజ్ఞప్తిపై ఎట్టకేలకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. పరీక్షలు రీషెడ్యూల్ చేయాలంటూ ఆదేశించారు. ఈ మేరకు పరీక్ష వాయిదా విషయంపై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.

గ్రూప్-2 పరీక్ష రీషెడ్యూల్ గురించి సీఎస్‌తో సీఎం కేసీఆర్ చర్చించారు. రీషెడ్యూల్ విషయంపై తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC)తో చర్చించాలని సీఎస్‌ను సీఎం ఆదేశించారు. లక్షల మంది అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎస్‌ను ఆదేశించారు.

CM KCR

అంతేగాక, భవిష్యత్‌లో విడుదల చేయబోయే నోటిఫికేషన్ల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సీఎం కేసీఆర్ సూచించారు. ప్రతి అభ్యర్థికి సన్నద్ధతకు సరిపడా సమయం లభించేలా చర్యలు తీసుకోవాలని సీఎస్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు అని మంత్రి కేటీఆర్ ట్వీట్టర్ వేదికగా వెల్లడించారు.

ఈ క్రమంలో ఆగస్టు 29, 30న జరగాల్సిన తెలంగాణ గ్రూప్-2 పరీక్షలు వాయిదా పడ్డాయి. నవంబర్ నెలలో గ్రూప్-2 పరీక్షలను నిర్వహించనున్నారు. దీంతో గ్రూప్-2 అభ్యర్థులు సన్నద్ధమయ్యేందుకు తగిన సమయం లభించనుంది.

అంతకుముందు గ్రూప్-2 పరీక్ష వాయిదాపై హైకోర్టు ఆదేశాలిలా

గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయాలన్న వినతులపై ఆగస్టు 14న నిర్ణయం తీసుకుంటామని హైకోర్టుకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) తెలిపింది. ఇప్పటికే పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయని కమిషన్ పేర్కొంది. ఆగస్టు 29, 30న జరగాల్సిన గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయాలని కోరుతూ 150 మంది అభ్యర్థులు వేసిన పిటిషన్‌పై శుక్రవారం జస్టిస్ పీ మాధవీదేవి విచారణ చేపట్టారు.

ఆగస్టు నెలలో గ్రూప్-2 సహా వేర్వేరు సిలబస్‌తో కూడిన 21 పోటీ పరీక్షలు ఉన్నాయని పిటిషనర్ల తరపు న్యాయవాదులు గిరిధర్ రావు, నర్సింగ్ కోర్టుకు దృష్టికి తీసుకెళ్లారు. గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షలు చాలా ముఖ్యమైనవి. గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయాలని జూన్‌లోనే వినతిపత్రం ఇచ్చినప్పటికీ.. టీఎస్‌పీఎస్సీ స్పందించలేదు. నియామక పరీక్ష నిర్వహణ ప్రధాన ఉద్దేశం నెరవేరేలా కమిషన్ వ్యవహరించడం లేదు అని కోర్టుకు వివరించారు.

ఇది ఇలావుంటే, గ్రూప్-2 పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని టీఎస్‌పీఎస్సీ తరపు న్యాయవాది రాంగోపాల్ రావు కోర్టుకు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1535 పరీక్ష కేంద్రాలు సిద్ధం చేశామని, ఆ కేంద్రాలకు ప్రభుత్వం సెలవులు కూడా ప్రకటించిందని చెప్పారు. గ్రూప్-2కి ఐదున్నర లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని.. అయితే, వీరిలో గురుకుల పరీక్షలు రాస్తున్నది కేవలం సుమారు 60వేల మంది అభ్యర్థులేనని తెలిపారు.

ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం.. గురుకుల పరీక్షలు రాస్తున్నది కొంతమంది అభ్యర్థులే అయినా.. వారికీ అవకాశం ఉండాలి కదా అని ప్రశ్నించింది. లక్షల మంది దరఖాస్తుదారుల్లో పిటిషన్ వేసింది 150 మందేనని టీఎస్‌పీఎస్సీ తెలుపగా.. కోర్టుకు అందరూ రాలేరని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయాలన్న అభ్యర్థుల వినతిపై నిర్ణయం ఆగస్టు 16వ తేదీలోపు చెబుతామని కమిషన్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

చాలా మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్నందున ఆగస్టు 14నే చెప్పాలని జడ్జీ ఆదేశించారు. దీంతో 14నే పరీక్ష వాయిదాపై తమ నిర్ణయం చెబుతామని టీఎస్‌పీఎస్సీ తరపు న్యాయవాది తెలిపారు. కాగా, గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయాలంటూ టీఎస్ పీఎస్సీ కార్యాలయం ఎదుట గురువారం భారీ ఎత్తున అభ్యర్థులు నిరసన చేపట్టిన విషయం తెలిసిందే.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+