రేవంత్ సంచలన నిర్ణయం, ఢిల్లీకి రిపోర్ట్ - మంత్రులకు టెన్షన్..!!

సంచలన నిర్ణయ దిశగా సీఎం రేవంత్ అడుగులు వేస్తున్నారు. జూబ్లీహిల్స్ లో గెలుపుతో పార్టీ హైకమాండ్ వద్ద రేవంత్ పరపతి పెరుగుతోంది. మంత్రివర్గ ప్రక్షాళనతో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ... నిర్ణయాల పై హైకమాండ్ ఫ్రీ హ్యాండ్ ఇస్తోంది. దీంతో.. ముఖ్యమంత్రి రేవంత్ ఈ రోజు జరిగే కేబినెట్ భేటీ వేదికగా కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. మంత్రులకు రేవంత్ బిగ్ టాస్క్ అప్పగించనున్నారు. హైకమాండ్ వద్ద తన ప్రణాళికలను వివరించిన రేవంత్.. ఇప్పుడు తీసుకునే నిర్ణయాల పైన ఉత్కంఠ కొనసాగుతోంది.

తెలంగాణ మంత్రివర్గం ఈ మధ్యాహ్నం భేటీ కానుంది. కీలక అంశాల పైన చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది. అందులో భాగంగా జూబ్లీహిల్స్ గెలుపు జోష్ తో స్థానిక సంస్థల ఎన్నికల దిశగా రేవంత్ వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. ఇప్పటికే పంచాయతీల పాలక మండళ్ల గడువు ముగిసి చాలా కాలమైనా.. ఎన్నికలు నిర్వహించకపోవడంతో ప్రభుత్వంపై ఒత్తిడి నెలకొని ఉంది. మరో వైపు ఈ కారణంతో కేంద్రం నుంచి రావాల్సిన సుమారు రూ.3 వేల కోట్ల నిధులు పెండింగ్‌లో ఉండిపోయాయని పంచాయతీరాజ్‌ శాఖ ప్రభుత్వానికి చెబుతూ వస్తోంది. అయితే స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ కల్పించాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఎన్నికలను వాయిదా వేస్తూ వస్తోంది. 42 శాతం రిజర్వేషన్‌ కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో 9ను నిలిపివేస్తూ హైకోర్టు ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికలు ఎలా నిర్వహించాలన్న దానిపై సోమవారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకోనుంది.

CM Revanth to announce key decision over local body Elections after cabinet discussions

కాగా, క్యాబినెట్‌ భేటీ కోసం స్థానిక ఎన్నికల పరిస్థితిపై పంచాయతీరాజ్‌ శాఖ సవివరమైన నోట్‌ను సిద్ధం చేసి ఉంచింది. సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులు, కేంద్ర నిధులు పెండింగ్‌లో ఉండడం, డిసెంబరు 1 నుంచి పార్లమెంటు సమావేశాలు జరగనున్న నేపథ్యంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ కోసం తుది ప్రయత్నాలు చేపట్టే అవకాశం వంటి అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని మంత్రివర్గం సమీక్షించనుంది. బీసీల రిజర్వేషన్‌ కోసం పార్లమెంటు సమావేశాల సందర్భంగా అఖిలపక్ష పార్టీలు, సంఘాలను ఢిల్లీకి తీసుకువెళ్లి ప్రధానిని కలవడం, పార్లమెంటు వేదికగా ఒత్తిడి తేవడం వంటి అంశాలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి.

దీంతోపాటు హైకోర్టు సూచన మేరకు పాత రిజర్వేషన్‌ ప్రకారమే ఎన్నికలకు వెళ్లి.. పార్టీ పరంగా బీసీలకు 42 శాతం సీట్లు ఇచ్చే అంశాన్నీ పరిశీలిస్తున్నారు. పంచాయతీలకు కేంద్రం నుంచి వచ్చే నిధులు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో తొలుత గ్రామపంచాయతీల వరకు ఎన్నికలు నిర్వహించాలన్న ప్రతిపాదననూ పరిశీలిస్తున్నారు. ఈ ప్రతిపాదనలన్నింటినీ సమీక్షించి.. స్థానిక ఎన్నికలపై క్యాబినెట్‌ ఓ నిర్ణయం వెల్లడించే అవకాశం కనిపిస్తోంది.

ఇదే సమయంలో డిసెంబర్‌ 8, 9 తేదీల్లో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ - 2025, ప్రజా ప్రభుత్వ విజయోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లపైనా సమీక్షించనున్నారు. వందేళ్ల ప్రగతికి రోడ్‌ మ్యాప్‌ కోసం రూపొందించనున్న తెలంగాణ రైజింగ్‌ - 2047 డాక్యుమెంట్‌ రూపకల్పనపైనా చర్చించనున్నారు. అందెశ్రీ స్మృతి వనం, అందెశ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగంపై నిర్ణయం తీసుకోనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ విజయం పైన మంత్రులకు సీఎం రేవంత్ స్పష్టత ఇవ్వనున్నారు. అందరూ సమిష్టిగా పని చేసి జూబ్లీహిల్స్ లో గెలిచిన విధంగానే స్థానిక సంస్థల్లోనూ తమ జిల్లాల్లో గెలిచి రావాలని.. ఎక్కడ వెనుకబడినా హైకమాండ్ కఠిన నిర్ణయాలు తప్పవనే హైకమాండ్ ఆదేశాలను వివరించనున్నారు. దీంతో.. ఈ కేబినెట్ భేటీలో తీసుకునే నిర్ణయాల పైన ఆసక్తి నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+