కేసీఆర్‌ను అంటే సహించం: జగన్‌కు తలసాని, వెళ్లి సీఎంకు చెప్తా: డీకే అరుణ
హైదరాబాద్: తెలంగాణ ప్రాజెక్టుల పైన ఏపీ ప్రభుత్వం, ప్రతిపక్షం రాద్దాంతం చేయవద్దని, ఏపీ రాజకీయాలను మా పైన రుద్దవద్దని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మంగళవారం నాడు సూచించారు. దీక్షల పేరుతో ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
గత ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చిన ప్రాజెక్టులనే తాము కడుతున్నామని, కొత్తగా కట్టేవి ఏవీ లేవని తెలిపారు. ఏపీలోని ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి జరుగుతున్న చిల్లర రాజకీయాలను తమ పైన రుద్దే ప్రయత్నం చేయవద్దని విజ్ఞప్తి చేశారు.
ప్రాజెక్టుల పైన అనవసర రాద్ధాంతం వద్దన్నారు. నేను ఇటు ఏపీ ప్రభుత్వానికి, అటు ప్రతిపక్షానికి రాజకీయాలు వద్దని విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు. ముఖ్యమంత్రి, మంత్రుల పైన ఇష్టానుసారం మాట్లాడితే సహించేది లేదని చెప్పారు. ప్రాజెక్టుల కోసం ఏపీ సర్కార్ ఎన్ని అనుమతులు తెచ్చిందో చెప్పాలన్నారు.

నిజాం షుగర్స్ పైన కవిత
ఈ నెల 18న సచివాలయంలో మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సమక్షంలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ పరిరక్షణపై సమావేశం జరగనుందని నిజామాబాద్ కవిత చెప్పారు. రైతులు ఎవరూ ఆందోళన చెందొద్దన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, హరితహారం కార్యక్రమాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ పనులను మరింత వేగవంతం చేయాలన్నారు.
గద్వాల జిల్లాపై డీకే అరుణ
గద్వాలను జిల్లాగా చేయాలని మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ విజ్ఞప్తి చేశారు. తనకు అపాయింటుమెంట్ ఇస్తే సీఎం కెసిఆర్‌ను కలిసి విజ్ఞప్తి చేస్తానని చెప్పారు. గద్వాల జిల్లా అయ్యేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని తెలిపారు. ఆమె సీఎస్ రాజీవ్ శర్మను కలిసి వినతి పత్రం ఇచ్చారు.












Click it and Unblock the Notifications