కుక్కల దాడి: తీవ్రంగా గాయపడిన మూడో తరగతి విద్యార్థి
హైదరాబాద్: హైదరాబాదు నగరంలో మరోసారి కుక్కలు పెట్రేగిపోయాయి. శ్రీకాంత్ అనే మూడో తరగతి విద్యార్థిపై నాలుగు కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. ఈ ఘటన గురువారంనాడు హైదరాబాదులోని బోయిన్‌పల్లి ఎస్సీ హాస్టల్లో జరిగింది.
కుక్కల దాడిలో శ్రీకాంత్ తీవ్రంగా గాయపడ్డాడు. అతని తలకు, ముఖానికి గాయాలయ్యాయి. అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. తోటి విద్యార్థులే అతన్ని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు అతన్ని నిరంతరం పరిశీలిస్తున్నారు.

హాస్టల్ ఆవరణలో విద్యార్థులు ఆడుకుంటుండగా ఒక్కసారిగా కుక్కలు దాడి చేశాయి. హాస్టల్లో వార్డెన్ లేరని తెలుస్తోంది. హాస్టల్లో దాదాపు 600 మంది విద్యార్థులు ఉంటారు. వార్డెన్ లేకపోవడాన్ని తీవ్రంగా తప్పు పడుతున్నారు.












Click it and Unblock the Notifications