హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఇంజనీరింగ్ విద్యార్ధి
హైదరాబాద్: ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి మండలం గంగారంలో సాయిస్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థి కొత్తపల్లి లక్ష్మీసాయి (23) గురువారం మధ్యాహ్నాం కళాశాలకు చెందిన హాస్టల్ గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గమనించిన తోటి విద్యార్ధులు కళాశాల యాజమాన్యానికి తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం బాడీని సమీప ఆసుపత్రికి తరలించారు. మృతుడు వేలేరుపాడు మండలం రుద్రంకోటకు చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.

హుస్సేన్‌సాగర్‌లో దూకి మహిళ ఆత్మహత్యాయత్నం
జీవితంపై విరక్తి చెందిన ఓ మహిళ గురువారం హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అయితే, ఇది గమనించిన లేక్ పోలీసులు వెంటనే ఆమెను రక్షించారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
భర్త పెట్టే వేధింపులు తాళలేక హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ గురువారం హుస్సేన్‌సాగర్‌లో దూకింది. ఇది గమనించిన పోలీసులు ఆమెను రక్షించడంతో ప్రాణాపాయం తప్పింది. కాగా గోల్కొండ పోలీస్‌స్టేషన్‌లో భార్యభర్తలకు కౌన్సెలింగ్ ఇచ్చారు.
పోలీసుల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న యువకులు అరెస్టు
పోలీసుల పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్న నలుగురు యువకులను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కూకట్‌పల్లి పరిధిలోగల పటేల్ కుంట దగ్గర నలుగురు యువకులు పోలీసుల పేరు చెప్పి డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్నారు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఆ యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్బంగా వారినుంచి మూడు మోటర్ సైకిళ్లు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications