హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కిడ్నాప్‌లు, బెదిరింపులు: మాజీ నక్సలైట్ అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఓ మాజీ నక్సలైట్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని రియల్టర్లు, బంగారం వ్యాపారులను కిడ్నాప్ చేయడం, హత్యలకు నక్సలైట్ కుట్రలు చేస్తున్నాడని పోలీసులు తెలిపారు.

ఇప్పటికే పలువురిని బెదిరించి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. మాజీ నక్సలైట్ నుంచి తుపాకీతో పాటు 40 రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.

Ex Nnaxalite arrested for kidnapping realter

కాగా, హైదరాబాదులోని కూకట్‌పల్లిలో గల దీనాబంద్ కాలనీలో ఓ దొంగను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దొంగ నుంచి 27 తులాల బంగరాం, 20 తులాల వెండి, రూ. 7.5 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు దొంగను విచారిస్తున్నారు.

అంబర్‌పేటలో అగ్నిప్రమాదం

రంగా రడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం పెద్ద అంబర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెద్దఅంబర్‌పేటలో ఉన్న సెల్‌టవర్ మంటలు చెలరేగాయి. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తోంది. మంటలు చెలరేగడంతో జనాలు భయభ్రాంతులకు గురయ్యారు.

English summary
An ex naxalite arrested in Hyderabad for allegedly kidnapping realters and businessmen.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X