నకిలీ 100నోట్ల కలకలం: రూ.500-1000కమీషన్‌తో చెలామణి!
నిర్మల్ మార్కెట్‌లో ఫుట్‌పాత్ వ్యాపారులకు కమీషన్ పద్ధతిలో రూ.2 వేలకు నకిలీ నోట్లు రూ.2,500 నుంచి రూ.3వేల వరకు ఇస్తున్నట్టు తెలుస్తోంది.
నిర్మల్: ఆదివారం నకిలీ నోట్లు కలకలం సృష్టించాయి. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికి చెందిన వృద్ధుడు బాబులాల్ నిర్మల్‌లో ఉన్ని దుస్తుల విక్రయ కేంద్రం ఏర్పాటు చేశారు. మామడ మండలానికి చెందిన శ్యామ్ ఆదివారం ఆ దుకాణంలో రూ.350 విలువైన ఉన్ని దుస్తులను కొనుగోలు చేసి తన వద్ద ఉన్న కొత్త రూ. 2వేల నోటు ఇచ్చారు.
ఆ వ్యాపారి శ్యామ్‌కు మిగతా చిల్లరను వందనోట్ల రూపంలో చెల్లించారు. తనకిచ్చిన నోట్లు సరైన నాణ్యత లేకపోవడంతో నకిలీవిగా భావించిన శ్యామ్ పోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడకు చేరుకుని సదరు వ్యాపారినుంచి రూ.1,500 విలువైన వందనోట్లను స్వాధీనం చేసుకున్నారు.

కాగా, ఆదివారం ఉదయంఇద్దరు వ్యక్తులు డబ్బులిచ్చి తనవద్ద ఉన్ని దుస్తులు కొనుగోలు చేసినట్లు ఆ వృద్ధుడు పేర్కొన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పట్టణ సీఐ జీవన్‌రెడ్డి.. అమర్‌సింగ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.
నిందితులను పట్టుకునేందుకు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు.
నిర్మల్ మార్కెట్‌లో ఫుట్‌పాత్ వ్యాపారులకు కమీషన్ పద్ధతిలో రూ.2 వేలకు నకిలీ నోట్లు రూ.2,500 నుంచి రూ.3వేల వరకు ఇస్తున్నట్టు తెలుస్తోంది. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో రూ. 100 నకిలీ నోట్లను కొందరు అక్రమార్కులు చెలామణిలోకి తెస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications