నకిలీ 2వేల నోట్లు! : ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు
తాజాగా హైదరాబాద్ లోని ఎల్బీనగర్ పరిధిలో నకిలీ నోట్ల ముఠా గుట్టు రట్టు చేశారు రాచకొండ కమిషనరేట్ పోలీసులు. వారి నుంచి దాదాపు రూ.33లక్షల విలువ చేసే రూ.2వేల నోట్లను స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ : కొత్తగా మార్కెట్లోకి వచ్చిన రూ.2వేల నోటుకు అప్పుడే నకిలీలు కూడా తయారైపోతున్నాయి. కొత్త నోట్లలో ప్రత్యేక సెక్యూరిటీ ఫీచర్లు ఏమి లేవని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్వయంగా వెల్లడించిన నేపథ్యంలో.. నకిలీ నోట్ల ముఠాలకు మరింత ఊతమిచ్చినట్టయింది.

తాజాగా హైదరాబాద్ లోని ఎల్బీనగర్ పరిధిలో నకిలీ నోట్ల ముఠా గుట్టు రట్టు చేశారు రాచకొండ కమిషనరేట్ పోలీసులు. వారి నుంచి దాదాపు రూ.33లక్షల విలువ చేసే రూ.2వేల నోట్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ముఠాలోని ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. కాగా, నకిలీ నోట్లను చలామణిలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్న ముఠాలపై పోలీసులు ప్రత్యేక ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications