Farmers: ధాన్యం అమ్ముడుపోయినా.. లారీలు రాక రైతుల అవస్థలు..
రాష్ట్రంలో అన్నదాతల పరిస్థితి దారుణంగా ఉంది. ఓ వైపు అకాల వర్షాలతో ఇప్పటికే తీవ్రంగా నష్టపోయిన రైతు ఇప్పుడు మిగిలిన కాస్త ధాన్యాన్ని అమ్ముకోలేని పరిస్థితి నెలకొంది. నేల పాలు కాగా మిగిలిన ధాన్యాన్ని ఐకేపీ, మార్కెట్ యార్డలకు తీసుకొస్తే అక్కడా.. రైతులకు చేదు అనుభవం ఎదురవుతోంది. చాలా చోట్లో రైతుల ధాన్యం ఐకేపీ, మార్కెట్ యార్డుల్లోనే ఉంటుంది. ఉన్న ధాన్యాన్ని కూడా కొనకపోవడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొన్న సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఓ రైతు తన ధాన్యం కొనాలని తహసీల్దార్ కాళ్లు పట్టుకున్నారు.
తాజాగా కొనుగోలు చేసిన వడ్లను కూడా రైస్ మిల్లర్లు తీసుకెళ్లకపోవడంతో ధాన్యం బాధ్యత రైతులపై పడింది. సూర్యాపేటలో ధాన్యం కొనుగోలు సెంటర్లలో రైస్ మిల్లర్లు వడ్లను కొనుగోలు చేశారు. కానీ ధాన్యాన్ని మిల్లులకు తీసుకెళ్లడం లేదు. కారణం లారీల కొరత కారణంగా మిల్లులకు తీసుకెళ్లడం కష్టంగా మారిందని వార చెబుతున్నారు. దీంతో రైతులు పంటను అమ్ముకున్నా.. కొనుగోలు కేంద్రాల్లోనే వాటికి కాపలా ఉండాల్సి వస్తుంది. రైతులు ఎప్పుడు వర్షమొస్తుందో.. వడ్లు తడుస్తాయో అని భయపడుతున్నారు.

రైతులు మిల్లర్లు పంపే లారీల కోసం వేటి ఉండలేకు.. తామే లారీలను వెతికే పనిలో పడ్డారు. లారీల కొరతపై సంబంధిత అధికారులకు చెప్పినా పట్టించుకోవపోవడం లేదని అన్నదాతలు వాపోతున్నారు. ఇప్పటికే అకాల వర్షంతో సగానికి సగం పంట నష్టపోయామని.. ఉన్న పంటను అమ్ముకున్నా.. దాన్యాన్ని మిల్లు కు తరలించే వరకు తమదే బాధ్యత అని అధికారులు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు కరీంనగర్ జిల్లాలో కూడా వడ్ల కొనుగోళ్లు నత్తనడకన కొనసాగుతోన్నాయి.
మానకొండూర్ సహకార సంఘం పరిధిలో ముంజంపల్లి, సదాశివపల్లి, లింగాపూర్, అన్నారం, ఖాదర్‌గూడెం, చెంజర్ల, గంగిపల్లి, కొండపల్కల, మద్దికుంట, పోచంపల్లి, కెల్లేడు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఊటూర్ పరిధిలో ఊటూర్, వేగరుపల్లి, లక్ష్మీపూర్, వెల్ది, రంగపేట, దేవంపల్లి పరిధిలో దేవంపల్లి, పచ్చునూర్, లలితాపూర్ గ్రామాల్లో కేంద్రాలు ఏర్పాటు చేశా రు. ఐకేపీ ఆధ్వర్యంలో రంగపేట, హకా ఆధ్వర్యంలో మానకొండూర్ మార్కెట్‌లో, గట్టుదుద్దెనపల్లి సహకార సంఘం పరిధిలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా.. కొనుగోళ్లు నత్తనడకన కొనసాగుతోన్నాయి.












Click it and Unblock the Notifications