Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Filmi Updates:జక్కన్న పై బ్రిటీషర్లు ఆగ్రహం-ఏం జరిగింది..?

హైదరాబాద్: ఫిలిం ఇండస్ట్రీలో గాసిప్స్‌కు కొదువ లేదు. ఈ గాసిప్స్ ఒక్క టాలీవుడ్‌కే పరిమితం కాదు.ఇలాంటి గాసిప్స్‌తో పాటు ఫిలిం ఇండస్ట్రీ లేటెస్ట్ న్యూస్ మీకోసం.

 ఇమ్రాన్ హష్మీపై కశ్మీర్‌లో రాళ్లదాడి..?

ఇమ్రాన్ హష్మీపై కశ్మీర్‌లో రాళ్లదాడి..?

ఇమ్రాన్ హష్మీ... రొమాంటిక్ హీరోగా ముద్రపడ్డ బాలీవుడ్ స్టార్. లిప్‌లాక్ సీన్స్‌లో ఎవరు చాలా నాచురల్‌గా నటిస్తారనే ప్రశ్న వస్తే కచ్చితంగా సమాధానం మాత్రం ఇమ్రాన్ హష్మీనే అవుతుంది. ఆ మధ్య సెక్సీ బ్యూటీ మల్లికా శెరావత్‌తో చేసిన రొమాంటిక్ సీన్‌ , తనుశ్రీదత్తాతో చేసిన లిప్‌లాక్ సీన్‌తో ఇమ్రాన్ హష్మీ క్రేజ్ మరో లెవెల్‌కు వెళ్లింది. అమ్మాయిలకు ది మోస్ట్ హ్యాపెనింగ్ హీరోగా తయారయ్యాడు.

తాజాగా ఇమ్రాన్ హష్మీ గ్రౌండ్ జీరో అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ కశ్మీర్‌లో జరుగుతుండగా... ఆ సమయంలో ఆయనపై కొందరు రాళ్లతో దాడి చేశారట. దీంతో ఇమ్రాన్ హష్మీకి గాయాలయ్యాయి.పహల్గామ్ స్టేషన్‌లో FIR కూడా నమోదైందంటూ వార్తలొచ్చాయి. అయితే ఈ వార్తల్లో నిజం లేదని సమాచారం. ఇమ్రాన్ హష్మీ బాగానే ఉన్నట్లు తెలుస్తోంది.కశ్మీరీలు తన పట్ల చాలా ప్రేమతో వ్యవహరించారని అక్కడ షూటింగ్‌కు కూడా సహకరించారంటూ స్వయంగా ట్వీట్ చేశాడు.

 ప్రేమ అక్కడే స్టార్ట్ అయ్యిందట

ప్రేమ అక్కడే స్టార్ట్ అయ్యిందట

రణ్‌బీర్ కపూర్- ఆలియా భట్.. ప్రస్తుతం బాలీవుడ్‌లో ది మోస్ట్ హ్యాపెనింగ్ కపుల్ .ప్రస్తుతం వీరు నటించిన బ్రహ్మాస్త్ర చిత్రం సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు ఈ దంపతులు.బాక్సాఫీస్ వద్ద రికార్డులు బ్రేక్ చేస్తుండటంతో ఈ కపుల్ గాల్లో తేలుతున్నారట.ఇప్పటి వరకు 360 కోట్లు కొల్లగొట్టింది బ్రహ్మాస్త్రం చిత్రం. ఇది పక్కనబెడితే ఈ కపుల్ తమ పర్సనల్ లైఫ్ గురించి ఓ మీడియాతో మాట్లాడారు.

బ్రహ్మాస్త్ర సెట్‌పైనే వీరి ప్రేమ చిగురించిందని ఆలియా భట్ చెప్పుకొచ్చింది.ఆ ప్రేమ సహజసిద్ధంగా ఏర్పడిందట. ఇద్దరికీ ఒకరిపై ఒకరికి ప్రగాఢ నమ్మకం ఉందని,ఒకరి వ్యక్తిత్వాన్ని ఒకరు గౌరవిస్తారని చెప్పుకొచ్చింది. ఇక ఆలియా భట్‌పై రణ్‌బీర్ కపూర్‌ పొగడ్తల వర్షం కురిపించాడు. తన భార్య ప్రపంచంలో ది బెస్ట్ మేనేజర్ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రొఫెషనల్ వర్క్‌లో కూడా ఇద్దరూ ఒకరికొకరు సహకరించుకుంటారని చెప్పుకొచ్చారు. ఆలియా భట్ త్వరలోనే ఓ బిడ్డకు జన్మనివ్వనుంది. ఇక బ్రహ్మాస్త్ర -2 కూడా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రాన్ని 2025 కల్లా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.

 రాజమౌళిపై బ్రిటీషర్ల ఆగ్రహం

రాజమౌళిపై బ్రిటీషర్ల ఆగ్రహం

RRR... దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన అద్భుతమైన చిత్రం. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. ఒక్క ఇండియాలోనే కాదు ఓవర్సీస్‌లో కూడా మంచి కలెక్షన్ల వర్షం కురిపించింది.ఈ మూవీకి హాలీవుడ్ నుంచి కూడా మంచి అప్రిషియేషన్ దక్కింది. అయితే యూకేలో ఈ సినిమా చూసిన కొందరు మరో రకంగా కామెంట్ చేశారట. బ్రిటీషర్లను విలన్లుగా చూపించడమేంటంటూ ప్రశ్నించారు.అయితే దీనికి ధీటైన సమాధానం జక్కన్న ఇచ్చారు.

బ్రిటీషు వారిని విలన్లుగా చూపించినప్పటికీ ఈ చిత్రాన్ని అక్కడి ప్రజలు ఎంతో ఆదరించారని రాజమౌళి చెప్పుకొచ్చారు. అయితే సినిమాకు ముందు డిస్‌క్లెయిమర్ కార్డు వేస్తామని... ఒకవేళ అది చూడటం మిస్ అయినప్పటికీ కూడా ఇదొక సినిమాగానే చూడాలని చరిత్ర కాదని వివరణ ఇచ్చారు. ఒక క్యారెక్టర్‌ను విలన్‌గా చూపించడం వల్ల బ్రిటీషర్లు అందరూ విలన్లు కారని క్లారిటీ ఇచ్చారు. ఒక కథ చెప్పే దర్శకుడిగా ఇవన్నీ పట్టించుకోవాల్సిన పనిలేదంటూ రాజమౌళి చెప్పుకొచ్చారు. ఇదంతా అటుంచితే.. రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ RRR చిత్రం ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయ్యే అవకాశాలున్నాయంటూ వార్తలొస్తున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+