ఎప్పుడూ ప్రతిపక్షంలోనే ఉండాలి, హరీష్‌కు జానా కౌంటర్ , ఇద్దరి మధ్య సరదా సంభాషణ
అసెంబ్లీ లాబీల్లో బుదవారం నాడు మంత్రి హరీష్ రావు, సిఎల్ పి నాయకుడు జానారెడ్డి మద్య సరదా సంభాషణ చోటుచేసుకొంది. పూజారులు ఆశీర్వదిస్తోంటే ఎప్పుడూ విపక్షంలోనే ఉండాలని హరీష్ కామెంట్ చేశాడు.
హైదరాబాద్ :తెలంగాణ అసెంబ్లీ లాబీల్లో బుదవారం నాడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డికి, రాష్ట్ర అసెంబ్లీ వ్యవహరాల శాఖ మంత్రి హారీష్ రావు మద్య ఆసక్కికర సంబాషణ చోటుచేసుకొంది.
అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే అసెంబ్లీ లాబీల్లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి మద్య హారీష్ రావు ఆసక్తికరమైన సంభాషణ జరిగింది.ఈ సంబాషణతో అక్కడున్నవారంతా నవ్వుకొన్నారు.

అసెంబ్లీ లాబీల్లోనే ప్రతి పక్ష నాయకుడు జానారెడ్డికి ధర్మపురి ఆలయ కమిటీని మంత్రి హరీష్ రావు పరిచయం చేశాడు.అయితే ఈ సందర్భంగా జానారెడ్డిని ఆలయ పూజారులు ఆశీర్వదించారు.
అయితే అదే సమయంలో మీరెప్పుడూ ప్రతిపక్ష నేతగానే ఉండాలంటూ హరీష్ రావు సరదాగా కామెంట్ చేశాడు. అయితే దానికి స్పందించిన జానారెడ్డి కూడ సరదాగానే కౌంటర్ ఇచ్చాడు.
అప్పటి పరిస్థితులను బట్టి డిసైడ్ అవుతోందని హరీష్ రావుకు జానారెడ్డి కౌంటర్ ఇచ్చాడు. జానా కూడ ఈ కౌంటర్ ను నవ్వుతూనే ఇచ్చాడు.దీంతో అక్కడున్నవారంతా పెద్దగా నవ్వారు.












Click it and Unblock the Notifications